దొంగలకెళ్లా మంచి దొంగోడు.. ఇంతకీ ఏం చేశాడంటే..?
ఏదిఏమైనా చివరకు తను వచ్చిన పనిని చేసుకొని వెళ్తుండడం వింటుంటాం.
By: Tupaki Desk | 6 Oct 2024 2:30 PM GMTదొంగతనాలు పలు రకాలు. ఒక్కో దొంగ.. ఒక్కో విధంగా దొంగతనాలు చేస్తుంటారు. కొందరు టెక్నాలజీని వాడుతుంటారు. మరికొందరు మైండును వాడుతుంటారు. ఏదిఏమైనా చివరకు తను వచ్చిన పనిని చేసుకొని వెళ్తుండడం వింటుంటాం. అయితే.. యూకేలో ఓ దొంగ చేసిన పనికీ ఇప్పుడు అందరూ నవ్వుకుంటున్నారు.
ఏదైనా వస్తువులను, నగదు, బంగారం చోరీ చేసేందుకు దొంగలు కొన్నికొన్ని సందర్భాల్లో హత్యలకూ వెనుకాడరు. ఇంకొందరు అయితే బెదిరించి, గాయపరిచి కావాల్సిన డబ్బు, బంగారం దోచుకెళ్తుంటారు. అయితే.. యూకేలో మాత్రం ఈ దొంగ ఇంట్లోని పనులన్నీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇల్లంతా నీటుగా సర్దడమే కాకుండా.. ఇంట్లో వారి కోసం ఏకంగా భోజనం కూడా తయారుచేసి వెళ్లిపోయాడు. వెళ్తూ.. వెళ్తూ ‘డోంట్ వర్రీ.. బీ హ్యాపీ’ అంటూ ఓ పేపర్‌పై రాసిపెట్టి మరీ వెళ్లాడు.
యూకేలోని మాన్‌మౌత్ షైర్‌లో ఈ ఘటన జరిగింది. డేమియన్ వాజినిలోవిక్జ్ అనే దొంగ.. ఈ వెరైటీ దొంగతనానికి పాల్పడ్డాడు. మాన్‌మౌత్‌షైర్‌లో ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన అతను.. మహిళ ఒంటరిగా ఉంటున్నట్లు పసిగట్టాడు. దాంతో ఆ యువతికి సంబంధించిన బట్టలన్నీ ఉతికాడు. అంతేకాకుండా ఇంటి పనినంతా చేశాడు. కిచెన్, ఫ్రిజ్ అన్నీ నీట్‌గా సర్దాడు.
ఇంటి కింద ఫ్లోర్, పైన ఫ్లోర్ కూడా తుడిచాడు. అంతటితో ఆగకుండా.. ఆ యువతి ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుందని భావించిన డేమియన్ భోజనం కూడా రెడీ చేశాడు. కేవలం ఇంట్లోని రెడ్ వైన్‌ను మాత్రం తాగాడు. అయితే.. ఆ సీసా, గ్లాసును మాత్రం అక్కడే టేబుల్‌పై వదిలేసి వెళ్లాడు. ఇంటికి వచ్చిన ఆ యువతి ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపింది. ఆ తర్వాత ఒంటరిగా ఉండలేక తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయింది. రెండు వారాల తర్వాత డేమియన్ దొరికినట్లు పోలీసులు ఆ యువతికి ఫోన్ చేశారు. దాంతో తన టెన్షన్ అంతా పోయిందని ఆ యువతి పేర్కొంది.