ప్రియుడిని సూట్ కేసులో పెట్టి జిప్ వేసి, మద్యం మత్తులో పడుకుంది!
తీరా ఉదయం లేచి చూసేసరికి సూట్ కేసులోని ప్రియుడు మృతి చెందాడు.
By: Tupaki Desk | 28 Oct 2024 5:19 AM GMTఓ మహిళ తన ప్రియుడిపై పీకల వరకూ పగ, కోపం వంటివి పెంచుకుందో ఏమో కానీ... అతడిని ఓ సూట్ కేసులో కుక్కి, జిప్పు పెట్టేసింది. అప్పటికే మద్యం మత్తులో ఉందేమో... వెంటనే నిద్రపోయింది. తీరా ఉదయం లేచి చూసేసరికి సూట్ కేసులోని ప్రియుడు మృతి చెందాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.
అవును... అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన సారా బూన్ (47) అనే మహిళ శుక్రవారం తన ప్రియుడు జార్జి టొర్రెస్ తో కలిసి మద్యం సేవించిందట. ఆ తర్వాత అతడిని సరదాగా సూట్ కేసులోకి వెళ్లమని, బయట జిప్ వేసింది. ఆ తర్వాత మద్యం మత్తులో నిద్రపోయింది. ఉదయానికి అతడు మృతి చెందాడు. దీంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిబ్రవరి 2020లో జరిగిన ఈ ఘటనపై కోర్టులో విచారణ జరిగింది. ఈ సూట్ కేసులోని అతడు స్వచ్చందంగా వెళ్లిన విషయం నిజమే కావొచ్చు కానీ.. అతడు తనంతట తానుగా బయటకు రాలేడన్న విషయం జిప్ వేసిన ఆమెకు తెలుసని న్యాయవాదులు తెలిపారు. దీంతో ఆమె సెకండ్ డిగ్రీ హత్యకు పాల్పడినట్లు తాజాగా జ్యూరీ నిర్ధారించింది.
ఈ సందర్భంగా స్పందించిన బూన్... తాను అతడు సూట్ కేసులో ఉండగా జిప్ చేశానని.. దానికి తామిద్దరం తమాషాగా భావించామని.. అతను సూట్ కేసు లోపల సరిపడే అంత చిన్నవాడని సరదాగా మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చింది. అతన్ని చంపడానికి తాను ప్రయతించలేదని బూన్... జ్యూరీలకు చెప్పారు!
అయితే.. జార్జి టొర్రెస్ పోస్టుమార్టమ్ రిపోర్ట్ లో అతడి పెదవితో పాటు చేతిపైనా, పుర్రెపైనా గాయాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో... ఆమె యావజ్జీవ కారాగారాన్ని ఎదుర్కోనున్నారని అంటున్నారు. ఆమెకు శిక్ష డిసెంబర్ ప్రారంభంలో విధించబడుతుందని చెబుతున్నారు!