Begin typing your search above and press return to search.

పొరపాటున 'థాంక్యూ సార్' అన్న ప్రయాణికురాలిని విమానం దించేశారు

మహిళా సిబ్బందిని పొరపాటున థాంక్యూ సర్ అన్నందుకు ఆగ్రహించిన సదరు సిబ్బంది ఆ ప్రయాణికురాలిని విమానం నుంచి కిందకు దించేసిన వైనం బయటకు వచ్చింది.

By:  Tupaki Desk   |   28 Jun 2024 7:30 AM GMT
పొరపాటున థాంక్యూ సార్ అన్న ప్రయాణికురాలిని విమానం దించేశారు
X

పొరపాట్లు సహజం. కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు అబ్బాయిలు మాదిరి.. కొందరు అబ్బాయిలు అమ్మాయిల మాదిరిగా కనిపిస్తూ కన్ఫ్యూజ్ చేస్తుంటారు.అయితే.. అలాంటి వారిని తమ మాటలతో ఇబ్బందికి గురి చేసే హక్కు ఎవరికి లేదు. కానీ.. పొరపాటుగా చేసిన ఒక చిన్న తప్పు విషయంలో ప్రముఖ విమానయాన సంస్థకు చెందిన విమాన సిబ్బంది ఒక మహిళా ప్రయాణికురాలి విషయంలో వ్యవహరించిన తీరు తెలిస్తే షాక్ తినాల్సిందే. మహిళా సిబ్బందిని పొరపాటున థాంక్యూ సర్ అన్నందుకు ఆగ్రహించిన సదరు సిబ్బంది ఆ ప్రయాణికురాలిని విమానం నుంచి కిందకు దించేసిన వైనం బయటకు వచ్చింది.

అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం.. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమాన సిబ్బంది కారణంగా చోటు చేసుకుంది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ వెళ్లే విమానంలో టెక్సాస్ కు చెందిన జెన్నా లాంగోరియా, తన కొడుకు, తల్లితో కలిసి విమానం ఎక్కేందుకు వెళ్లారు. ఆమెకు విమాన సిబ్బంది ఒకరు బోర్డింగ్ పాస్ అందించారు. దీనికి ప్రతిగా సదరు మహిళా అటెండెంట్ ను పొరపాటుగా పురుషుడిగా భావించి.. ‘థాంక్యూ సర్’ అని చెప్పింది.

దీనికి సదరు మహిళా అటెండెంట్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. ప్రయాణికురాలి తల్లిని.. బిడ్డను లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో జెన్నా మరో పురుష ఫ్లైట్ అటెండెంట్ సాయం కోరుతూ.. తన తల్లిని.. కొడుకును గేట్ వద్ద సదరు వ్యక్తి ఆపేశారని కంప్లైంట్ చేశారు. దీంతో.. సదరు మేల్ అటెండెంట్ ఆ సిబ్బంది పురుషుడు కాదు స్త్రీ అని బదులిచ్చారు.

తన తప్పును తెలుసుకున్న జెన్నా.. ఆ మహిళా అటెండెంట్ కు క్షమాపణలు చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోకపోగా.. ఫ్లైట్ నుంచి దించేసినట్లుగా సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మరోవైపు అదనపు లగేజీ కారణంగానే సదరు ప్రయాణికురాలిని అనుమతించలేదని విమానయాన సంస్థ స్పందనను పలువురు తప్పు పడుతున్నారు.