Begin typing your search above and press return to search.

ఏపీ బడ్జెట్...ఫస్ట్ టైం అలా చేస్తారా ?

దాంతో ఏపీ బడ్జెట్ మీట్ కూడా ఆ టైం లోనే ఉంటుంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   6 July 2024 3:15 AM GMT
ఏపీ బడ్జెట్...ఫస్ట్ టైం అలా చేస్తారా ?
X

ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల మూడవ వారంలో జరగబోతున్నాయి. దీనికి సంబంధించి డేట్లు ఇంకా ఖారారు కాలేదు కానీ కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23 నుంచి మొదలవుతాయని అంటున్నారు. దాంతో ఏపీ బడ్జెట్ మీట్ కూడా ఆ టైం లోనే ఉంటుంది అని అంటున్నారు.

ఏపీ బడ్జెట్ సమావేశాలు దాదాపుగా వారం నుంచి పది రోజుల పాటు పైగా సాగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తరువాత పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలుగా వీటిని చూడాల్సి ఉంది. దానితో పాటుగా శాసనమండలి సమావేశాలు ఈసారి ప్రారంభం అవుతాయి.

అయితే ఈసారి ఏపీ బడ్జెట్ ని కొత్త ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. కానీ ఏపీ బడ్జెట్ విషయంలో రకరకాలైన ప్రచారం సాగుతోంది. పూర్తి స్థాయిలో బడ్జెట్ ని ప్రవేశ పెట్టే విషయంలో ఆర్ధిక శాఖ తర్జన భర్జన పడుతోంది అని అంటున్నారు జూలై నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి అవుతుంది.

ఆగస్ట్ నుంచి 2025 మార్చి వరకూ ఎనిమిది నెలల కాలానికి పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. అయితే ఎనిమిది నెలలకు సంబంధించిన నిధుల సమీకరణ ఆదాయాలు ఎన్ని వచ్చే మార్గాలు ఏమిటి,అప్పులు ఇత్యాధి వివారాలను ఇపుడు ఆర్థిక శాఖ ముందేసుకుని తర్జన భర్జన పడుతోంది అని అంటున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 19 వేల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ వద్ద అప్పులు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇక ఏపీకి ఆదాయాలు తక్కువ అప్పులు ఎక్కువ ఉన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో బడ్జెట్ అంటే అన్ని వర్గాలు ఆశగా చూస్తాయి. ముఖ్యంగా సంక్షేమ పధకాల విషయంలో భారీ హామీలు ఇచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది.

వాటి మీద బడ్జెట్ లో ప్రకటన చేయాల్సి ఉంటుంది చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. దాంతో వాటికి నిధులు ఏ మేరకు సమకూరుస్తారు. ఎక్కడ నుంచి కేటాయిస్తారు అన్నది ఒక చర్చగా ఉంది. అదే సమయంలో అమరావతి పోలవరం వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల గురించి బడ్జెట్ లో వివరించాల్సి ఉంది.

ఇలా చాలా అంశాలు ఉన్నాయి. కేంద్రం వివిధ ప్రాజెక్టులకు నిధులతో పాటు గ్రాంట్స్ కొన్ని ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. దాంతో కేంద్ర బడ్జెట్ మీద ఆశలు పెట్టుకుంది. అందువల్ల కేంద్ర బడ్జెట్ ని చూసి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలా అన్న కొత్త ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు.

ప్రస్తుతానికి ఓటాను అకౌట్ బడ్జెట్ ని ప్రవేశ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారుట. అంటే జస్ట్ ఒక రెండు నెలలకు మాత్రమే సరిపడా ఓటాన్ అకౌంట్ ని సభలో ప్రవేశ పెట్టి ఆ తరువాత ఆరు నెలలకు పూర్తి బడ్జెట్ పెట్టాలని చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

అయితే ఈ విషయంలో ఆర్ధిక శాఖ అయితే ఒక నిర్ణయానికి రాలేకపోతోంది అని అంటున్నారు. బడ్జెట్ మీద తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నా ఒక కొలిక్కి అయితే రాలేకపోతోంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని కనుక ప్రభుత్వం ప్రవేశపెడితే అది చరిత్రలో ఫస్ట్ టైం అవుతుందని అంటున్నారు.

సాధారణంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయి బడ్జెట్ నే ప్రవేశపెడుతుంది. ఏపీలో ఉన్న ఆర్ధికపరమైన అంశాలు, ఇతరత్రా పరిస్థితుల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ కి మొగ్గు చూపుతారు అని అంటున్నారు. మరి ఏమి జరుగుతుందో తెలియాల్సి ఉంది.