Begin typing your search above and press return to search.

బీహార్ నుంచి కేంద్రానికి మరో డిమాండ్!... నిర్మలమ్మకు కష్టమే!?

ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే అది వీరిద్దరి భుజాలపైనే అనే చెప్పాలి!

By:  Tupaki Desk   |   10 July 2024 1:30 AM GMT
బీహార్  నుంచి కేంద్రానికి మరో డిమాండ్!... నిర్మలమ్మకు కష్టమే!?
X

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీయే సర్కార్ అధికారంలోకి రావడంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం పార్టీ, బీహార్ కు చెందిన జేడీయూలు కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే అది వీరిద్దరి భుజాలపైనే అనే చెప్పాలి!

దీంతో... ఆయా రాష్ట్రాల అభివృద్ధి విషయంలో ఇప్పుడు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత మరింత పెరిగిందని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది మన పార్టీ కాదు, నిధుల సమీకరణ కష్టమవుతుంది, కేంద్రం నుంచి మద్దతు లేదు వంటి సాకులు చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదని స్పష్టం చేస్తున్నారు. ఇది ఒకరకంగా ఈ రెండు రాష్ట్రాలకూ శుభవార్తనే చెప్పాలి.

ఈ నేపథ్యంలోనే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా బీహార్ నుంచి ఇప్పటికే ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకి రాగా.. ఇటీవల మోడీని కలిసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి లక్ష కోట్ల సహాయం డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తూతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు అది కచ్చితంగా సాధిస్తారని కూడా అంటున్నారు.

మరోపక్క తాజాగా బీహార్ నుంచి మరో డిమాండ్ వచ్చిందని అంటున్నారు. ఇందులో భాగంగా... బీహార్ లో ప్రాజెక్టుల అభివృద్ధికి బడ్జెట్ లో 30 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జరిగిన ప్రీ బడ్జెట్ మీటింగ్ లో ఈ డిమాండ్ ను లేవనెత్తినట్లు చెబుతున్నారు.

అవును... బీహార్ ప్రాజెక్టుల అభివృద్ధికి బడ్జెట్ లో 30 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే సర్కార్ కు ఈ బడ్జెట్ రూపకల్పన సవాల్ గా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తితో పాటు ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హామీలు అలా ఉండనే ఉన్నాయి!!