రాహుల్ కి రాహుకాలం పోయిందిగా !
లేకపోతే ఆయనే ఇందిరాగాంధీకి సిసలైన వారుసుడు అయి ఉండేవారు అని అంటారు.
By: Tupaki Desk | 15 July 2024 3:00 AM GMTకాంగ్రెస్ అగ్ర నేత గాంధీల ఐదో తరం వారసుడు రాహుల్ గాంధీకి రాహు కాలం పోయింది అని అంటున్నారు. రాహుల్ గాంధీ 2004లో పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చారు. అంటే రెండు దశాబ్దాల క్రితం. అప్పటికి ఆయన వయసు 34 ఏళ్ళు. ఆయన బాబాయ్ సంజయ్ గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పాతికేళ్ళకే రాజకీయంగా చురుకుగా ఉంటూ వచ్చారు. ఆయన 33 ఏళ్ళలోపే అమేధీ నుంచి ఎంపీగా అయ్యారు. అదే వయసులో ఆయన మరణించారు. లేకపోతే ఆయనే ఇందిరాగాంధీకి సిసలైన వారుసుడు అయి ఉండేవారు అని అంటారు.
మరో వైపు చూస్తే సంజయ్ మరణించిన తరువాత్ రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1981లో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేరి ఆ వెంటనే అమేధీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. రాజీవ్ గాంధీ ఎంపీ అయ్యేనాటికి వయసు 36 ఏళ్ళు. అయితే రాజీవ్ గాంధీ నలభయ్యేళ్ళకే దేశానికి ప్రధాని అయి సరికొత్త రికార్డుని క్రియేట్ చేశారు. ఆ రికార్డు ఎవరూ బద్ధలు కొట్టలేదు.
దానికి రాహుల్ గాంధీకి అవకాశం ఉన్నా ఆయన ప్రధాని కాలేదు. ఎందుకంటే 34 ఏళ్లకే ఎంపీ అయిన రాహుల్ యూపీయే వన్ టూ లో కేవలం సాధారణ పార్లమెంట్ మెంబర్ గానే పనిచేశారు. ఆయన తలచుకుంటే 2009లో రెండవ టెర్మ్ లో ప్రధాని అయ్యేవారు. అలా 39 ఏళ్లకే ప్రధాని అయ్యే అవకాశాన్ని తోసిపుచ్చినందుకు రాహుల్ మరో రెండు దశాబ్దాలు నిరీక్షించాల్సి వస్తోంది.
అదే విధంగా చూస్తే 2014లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ తరఫున విపక్షంలో ఉన్నారు. 2019లో అధికారంలోకి వస్తామనుకున్నా రాలేకపోయారు 2024లో అయితే దాదాపుగా దగ్గరగా వచ్చేశారు. ఇపుడు చూస్తే తాజా ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి మొత్తం మోత మోగించింది.
దాంతో దేశమంతా ఇండియా కూటమి గాలి వీస్తోంది. ఇక మీదట ఏ ఎన్నికలు జరిగినా పూర్తి ఆత్మ విశ్వాసంతో ఇండియా కూటమి ఎన్నికల్లో పాలు పంచుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎంపిక అయ్యారు. కొత్త పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చేసిన తొలి ప్రసంగానికి మంచి స్పందన లభించింది.
ఈ నెల 22 నుంచి ప్రారంభం కాబోతున్న బడ్జెట్ సమావేశాలలో రాహుల్ గాంధీ రెట్టించిన ఉత్సాహంతో కనిపించనున్నారు అని అంటున్నారు. దేశంలో ప్రజల మూడ్ ఏంటో ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడించినందువల్ల రాహుల్ గాంధీ మోడీ సర్కార్ ని టార్గెట్ చేసుకుంటారు అని అంటున్నారు.
ఈ బడ్జెట్ సమావేశాలలో రాహుల్ ని తట్టుకోవడం అధికార ఎన్డీయే కూటమికి బహు కష్టమని అంటున్నారు. అదే విధంగా చూసెతే కనుక రానున్న కాలంలో అధికార పార్టీకి ఇబ్బందులు అన్ని వైపుల నుంచి తప్పవని అంటున్నారు. ఇక రాహుల్ గాంధీ విషయం తీసుకుంటే ఆయనకు రాజకీయంగా ఇప్పటి దాకా కాలం కలిసి రాలేదు అని అంటున్నారు.
ఇపుడు చూస్తే అదంతా పోయింది అని అంటున్నారు. రానున్న రోజులు అన్నీ రాహుల్ గాంధీకి మంచి రోజులే అని అంటున్నారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పెద్ద పార్టీ. వంద దాకా ఎంపీలు ఉన్న పార్టీ. రానున్న కాలంలో గుజరాత్ ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్, అసోం వంటి రాష్ట్రాలలో బీజేపీతో ముఖా ముఖీ తలపడే సత్తా కాంగ్రెస్ కే ఉందని అంటున్నారు.
దాంతో పాటు భారత్ జోడో యాత్రను రెండు విడతలుగా చేసి రాహుల్ కాంగ్రెస్ గ్రాఫ్ పెంచారు. దాంతో పాటు తన గ్రాఫ్ ని పొలిటికల్ ఇమేజ్ ని కూడా పెంచుకున్నారు. రాహుల్ పాదయాత్ర ఫలితంగా ఉత్తరాదిన రాజకీయ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది అని అంటున్నారు. రాహుల్ లోని నాయకత్వ లక్షణాలను ఇపుడు జనాలు గుర్తించారు. అలాగే కాంగ్రెస్ మిత్రులు కూడా గుర్తించారు అని అంటున్నారు. దానికి ఉదాహరణ రెండవ మాట లేకుండా ఆయనకే ప్రధాన ప్రతిపక్ష స్థానం అప్పగించే విషయంలో ఇండియా కూటమి సహకరించడం.
ఒక విధంగా వెయిటింగ్ ప్రైమ్ మినిస్టర్ గా రాహుల్ గాంధీ ఉన్నారు. రానున్న కాలంలో రాహుల్ తన దూకుడుని మరింతగా పెంచుతారని అంటున్నారు. ఈ అయిదేళ్ళ కాలం మోడీ సర్కార్ పాలిస్తే అది అద్భుతమే అవుతుందని ఇండియా కూటమి అంటోంది. ఈ మధ్యలో ఏమైనా ఇబ్బందులు వస్తే ఈ టెర్మ్ లోనే రాహుల్ ప్రధాని అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. మొత్తానికి రాహుల్ అయిదున్నర పదుల వయసులో దేశానికి ప్రధాని అవుతారా అన్నదే ఢిల్లీ వర్గాలలో కొత్త చర్చగా ఉంది అంటున్నారు.