Begin typing your search above and press return to search.

జూన్ 9... విజయవాడ - విశాఖల్లో తాజా పరిస్థితి ఇదే!

దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జూన్ 4 ఎంత హాట్ తేదీనో.. జూన్ 9 కూడా అంతే హాట్ డేట్ లా మారిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 May 2024 1:29 PM GMT
జూన్  9... విజయవాడ - విశాఖల్లో తాజా పరిస్థితి ఇదే!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న ముగిసిన అనంతరం.. ప్రజానికం అంతా జూన్ 4న వెలువడబోయే ఫలితాలవైపు చూస్తుంటే... మరికొంతమంది పార్టీ శ్రేణులూ, నాయకులూ మాత్రం జూన్ 9ని లక్ష్యంగా చేసుకుని రకరకాల ప్లాన్స్ చేస్తున్నారని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జూన్ 4 ఎంత హాట్ తేదీనో.. జూన్ 9 కూడా అంతే హాట్ డేట్ లా మారిందని అంటున్నారు.

అవును... ఏపీలో పోలింగ్ ముగిసిన అనంతరం రెండు రకాల విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... పోలింగ్ అధిక శాతం నమోదైంది కాబట్టి, అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోపక్క... అత్యధిక పోలింగ్ శాతం నమోదవ్వడానికి కారణం మహిళలు, వృద్ధులూ అని.. వారంతా జగన్ వైపే ఉన్నారని, జూన్ 4న తెలుస్తాదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఈ సమయంలో ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవడం కన్ఫాం అని.. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ.. జూన్ 9ని ముహూర్తంగా చెబుతున్నారు. మరోపక్క... అదే రోజు చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ.. ప్లేస్ కన్ఫాం కాకపోవడంతో... ప్రస్తుతానికి విజయవాడకు వచ్చే ఫ్లైట్లూ, ట్రైన్ టిక్కెట్లూ ఫుల్ అయిపోతున్నాయని అంటున్నారు. ఇక విశాఖపట్నం విషయానికొస్తే వ్యవహారం పీక్స్ కి చేరిందని చెబుతున్నారు. దీంతో.. ఈ ధీమాపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ తెరపైకి వస్తోంది.

ఇందులో భాగంగా జూన్ 9న పక్క రాష్ట్రాల నుంచి, పలు జిల్లల నుంచి విశాఖకు వెళ్లే ఫ్లైట్ టిక్కెట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయని అంటున్నారు. ఇదే సమయంలో ట్రైన్, బస్సు టిక్కెట్లూ నిల్ గా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇక్కడ వైసీపీ అభిమానులూ, నేతలూ మరో అడుగు ముందుకేసి.. విశాఖలో సాధారణ హోటల్ నుంచి ఐదు నక్షత్రాల హోటల్ వరకూ అన్ని రూమ్స్ బుక్ చేసేసుకుంటున్నారని అంటున్నారు.

దీంతో... జూన్ 9 అనేది ఏపీ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారింది. మరి అంతకంటే ముందు జూన్ 4 న వెలువడే ఫలితాల్లో విజయం ఎవరిని వరించబోతోంది.. సీఎంగా ఎవరు ప్రమాణస్వీకారం చేయబోతున్నారనేది వేచి చూడాలి!