Begin typing your search above and press return to search.

సచివాలయం స్టాఫ్ ని వాడేసుకుంటున్నారుగా !

అంతవరకూ బాగానే ఉంది కానీ కేవలం రెండు వేల మంది జనాభాకు పది మంది సచివాలయం స్టాఫ్ ని పెట్టడమే అసలు స్టోరీ.

By:  Tupaki Desk   |   22 Aug 2024 3:15 AM GMT
సచివాలయం స్టాఫ్ ని వాడేసుకుంటున్నారుగా !
X

సచివాలయం వ్యవస్థ అన్నది జగన్ మార్క్ క్రియేషన్. ప్రజల వద్దకు పాలన అంటూ ఈ అపర సృష్టి చేశారు. అంతవరకూ బాగానే ఉంది కానీ కేవలం రెండు వేల మంది జనాభాకు పది మంది సచివాలయం స్టాఫ్ ని పెట్టడమే అసలు స్టోరీ. అంటే ప్రతీ రెండు వందల మందికి ఒక పర్మనెంట్ ఉద్యోగి అన్న మాట.

ఈ విధంగా ఎక్కడా ఉండదు. అలా సచివాలయ వ్యవస్థను డిజైన్ చేయడంతో ఎక్కువ మందికి పని లేకపోయింది. ఎక్కువ పని మాత్రం వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీలకే ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో అందరినీ పర్మనెంట్ చేసి జీతాలు చెల్లించేవారు. అలా అయిదేళ్ల పాటు లక్షా అరవై వేల మంది దాకా సచివాలయ స్టాఫ్ కి జీతాల కోసం వేల కోట్లు ఖర్చు చేశారు.

ఇక జగన్ అధికారం నుంచి దిగిపోయాక కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వానికి సచివాలయాల విషయంలో ఏమి చేయాలో ఇంకా క్లారిటీ లేదని అంటున్నారు. ఖాళీగా ఉన్న వారిని ప్రభుత్వ శాఖలకు షిఫ్ట్ చేసి అక్కడ సేవలను వాడుకోవాలా అన్న ఆలోచనలు ఉన్నాయి.

అదే సమయంలో వారి సేవలను నెల నెలా సామాజిక పెన్షన్ల పంపిణీకి ఉపయోగిస్తున్నారు. ఇపుడు కొత్తగా మరిన్ని పనులు వారికి అప్పగించారు. అన్నా క్యాంటీన్ల పర్యవేక్షణ బాధ్యలను సచివాలయం వార్డు వెల్ఫేర్ సెక్రటరీలకు అప్పగించారు. వీరు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు వరకూ అన్నా క్యాంటీన్ల వద్ద ఉంటూ మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. దాంతో ఇదేమి అడవి చాకిరీ అని సచివాలయం సిబ్బంది మండిపోతున్నారు.

మరో వైపు చూస్తే ఇదే సిబ్బంది చేత బడికి రాని పిల్లలు బడి మానేసిన పిల్లలను గుర్తించమని ఇంటింటికీ తిప్పుతున్నారు. అలా డ్రాపౌట్స్ ని గుర్తించే బాధ్యత వారికి అప్పగించారు. ఇక తోడు పథకం కింద చిరు వ్యాపారులను గుర్తించమని యాప్స్ లో అప్ లోడ్ చేయమని కూడా కొత్త డ్యూటీ వేశారు.

ఇవి చాలవు అన్నట్లుగా ప్రతీ పాఠశాలలో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉన్నాయో లేవో చూసి వారానికి రెండు రోజులు పాఠశాలలకు వెళ్ళి ఫోటోలు తీసే బాధ్యతను అప్పగించారు ఇలా వరసబెట్టి తమకు డ్యూటీలు వేయడం పట్ల సచివాలయం ఉద్యోగులు మండిపోతున్నారు.

తమను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించి వారి స్కేల్ అమలు చేసి తమకు ప్రమోషన్లు ఇస్తారని అనుకుంటే ఏ విధంగానూ ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగాలను అలాగే ఉంచి ఇపుడు ఇన్నేసి కొత్త డ్యూటీలు వేయడం ఏమిటి ఫైర్ అవుతున్నారు. ఇక విద్యాశాఖలో పదోన్నతులకు విధుల నిర్వహణకు ఏ విధంగానూ పనికి రాని సచివాలయ ఉద్యోగులకు పాఠశాలకు చెందిన టాయిలెట్ల పని డ్రాపౌట్ల పని అప్పగించడం ఏంటని గుస్సా అవుతున్నారు

దీని మీద రాష్ట్ర సచివాలయ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయితే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి దీని మీద విన్నపం చేశారు. తమకు సంబంధం లేని విధులను ఎలా కేటాయిస్తారని అంటున్నారు. ఇదే తీరున ప్రభుత్వ వైఖరి ఉంటే బడులలో బాత్ రూం లను కడుగుతూ నిరసనలను వ్యక్తం చేస్తామని అంటున్నారు.

అయితే సచివాలయం స్టాఫ్ కి డ్యూటీ చార్ట్ ప్రకారం చూడాలి అంటే పనులు అయితే పెద్దగా లేవు. వెల్ఫేర్ స్కీమ్ అమలు అయితే వెల్ఫేర్ సెక్రటరీ అలాగే ఎడ్యుకేషన్ సెక్రటరీకి కొంత పని ఉండేది. ఇపుడు అదీ పెద్దగా లేదు మరి జీతాలు ఇస్తున్నారు కాబట్టే వారి చేత పనులు చేయిస్తున్నారు అని అంటున్నారు. అయితే తాము పని చేయడానికి రెడీ అని ప్రభుత్వం తమకు తగిన చోట నియమించి పూర్తి సేవలను తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.