Begin typing your search above and press return to search.

కేసీయార్ రేవంత్ ఇద్దరినీ ఓడించిన జెయింట్ కిల్లర్ ఆయనే...

ఆయనే జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్న బీజేపీ నేత వెంకట రమణారెడ్డి.

By:  Tupaki Desk   |   3 Dec 2023 11:02 AM GMT
కేసీయార్ రేవంత్ ఇద్దరినీ ఓడించిన జెయింట్ కిల్లర్ ఆయనే...
X

ఇది కదా అద్భుతమైన విజయం అంటే అని అనిపించకమానదు. ఒకరేమో దిగిపోతున్న ముఖ్యమంత్రి. మరొకరు ఏమో కాబోతున్న ముఖ్యమంత్రి ఈ ఇద్దరినీ ఓడించిన వారిని మొనగాడు అనకుండా ఏమనాలి. ఆయనే జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్న బీజేపీ నేత వెంకట రమణారెడ్డి

కామారెడ్డిలో ఈ అద్భుతం జరిగింది. అక్కడ కేసీయార్ పోటీ చేశారు. ఆయన ఎందుకు పోటీకి దిగారో ఎవరికీ తెలియదు. ఇక ఆయనను ఓడిస్తాను అని రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. ఇద్దరికీ కంఫర్టబుల్ గా గెలిచేందుకు సొంత సీట్లు ఉన్నాయి. అక్కడ భారీ మెజారిటీలు వస్తున్నాయి.

కానీ కామారెడ్డిలో ఈ ఇద్దరూ పోటీకి దిగారు. ఇక ఈ ఇద్దరి మధ్యనే గెలుపు ఉంటుందని అంతా ఊహించారు. కేసీయార్ ని ఓడించేది రేవంత్ రెడ్డే అని అంతా అనుకున్నారు. కాదు రేవంత్ రెడ్డిని కేసీయార్ ఓడిస్తారు అని అన్నారు. ఇదిలా ఉంటే కామారెడ్డిలో కేసీయార్ మీద రేవంత్ రెడ్డి ఓట్ల ఆధిపత్యంతో ఉంటే ఆయనను వెనక్కి నెట్టి మూడు నుంచి రెండు అలాగే రెండు నుంచి ఒకటో స్థానానికి బీజేపీ అభ్యర్ధి వెంకట రమణారెడ్డి వచ్చేశారు.

ఆయన 14వ రౌండ్ నుంచి తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఆయన 14వ రౌండ్ లో ఉంటూ ఆ మీదట దాన్ని నిలబెట్టుకుని అలాగే కొనసాగారు. మొత్తానికి తుది ఫలితం వచ్చేసరికి మాత్రం వెంకట రమణారెడ్డి ఈ ఇద్దరు బిగ్ షాట్స్ మీద గెలిచి సత్తా చాటారు.

ఏకంగా ఆయన జాతీయ స్థాయిలో తన పేరు మారుమోగేలా చేసుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తామని ఎన్నో కలలు కంది.. కానీ ఇద్దరు టాప్ లీడర్స్ ని ఓడించి బీజేపీకి నిండుగా ఆనందం ఇచ్చారు వెంకట రమణారెడ్డి.

ఆయన పక్కా లోకల్ నినాదంతో దూసుకుని పోతే ఉప ఎన్నికల ఇబ్బంది లేకుండా జనాలు కూడా విచక్షణతో కూడిన తీర్పు ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి చూస్తే కామారెడ్డి లో బీజేపీ గెలుపు చారిత్రాత్మక విజయం అని అంటున్నారు.