ఇలా అయితే.. పెట్టుబడులు వచ్చేనా.. సీఎం సర్.. !
రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయిందని.. సైకో ముఖ్యమంత్రి ఉన్నాడని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
By: Tupaki Desk | 19 July 2024 11:30 PM GMTరాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కానీ, పరిస్థితులు మాత్రం ఏమాత్రం మారలేదు. ఇదీ.. ఇప్పుడు ఏనలుగు రు కలిసినా వ్యాఖ్యానిస్తున్న మాట. ఎక్కడికక్కడ.. హత్యలు, దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక ప్పుడు వైసీపీ హయాంలో ఇవి కామన్‌గా మారాయని కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి వంటివారు ఎక్కడ ఎప్పుడు అవకాశం వచ్చినా.. వైసీపీ ప్రభుత్వాన్ని ఏకేశారు. రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయిందని.. సైకో ముఖ్యమంత్రి ఉన్నాడని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
మరి ఇప్పుడు ఏం జరుగుతోంది ? అంటే.. వైసీపీ పాలనలో కంటే కూడా.. ఎక్కువగానే.. శాంతి భద్రతలకు భంగం ఏర్పడుతోందని.. టీడీపీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు. బహిరంగంగానే హత్యలు జరుగు తున్నాయి. కత్తులతో వెంటాడి వేటాడుతున్న పరిస్థితులు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే.. 6 చోట్ల.. హత్యలు జరిగాయి. వీటిలో ఎవరు ఉన్నారు? ఏ పార్టీ సానుభూతి పరులు ఉన్నారనే విషయాన్ని పక్కన పెడితే.. ఇలాంటి పరిణామాలతో పెట్టుబడులపై ప్రభావం పడుతుందనేది వాస్తవం.
ఎందుకంటే.. తాజాగా జరిగిన ఆరు హత్యలను కూడా.. జాతీయ మీడియా పెద్ద ఎత్తున ప్రొజెక్టు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం దీనిని ఖండించేందుకు ప్రయత్నించినా.. వాస్తవాలు మాత్రం కనుమరుగు కావు కదా! సో.. ఇవి పెట్టుబడులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక, గత వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దారుణాలు మరో ఎత్తు. విజయనగరం నుంచి కడప వరకు.. చిన్నారులపై అత్యాచా రాలు హత్యలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో కూడా తెలియడం లేదనే బావనను తీసుకు వచ్చాయి.
రాష్ట్రంలో వైసీపీ పోతే.. శాంతి భద్రతలు ఆటోమేటిక్‌గా వస్తాయని.. ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కూడా చెప్పారు. ఇక, చంద్రబాబు సరేసరి. కానీ, కూటమి సర్కారు వచ్చాక జరుగుతున్న ఈ దారుణాలను గమనిస్తే.. శాంతి భద్రతలు ఎంత వీక్‌గా ఉన్నాయో.. అర్థమవుతోందని.. జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఇక్కడ దాచేందుకు కానీ.. ఆరోపించేందుకు కానీ.. కూటమిసర్కారంటే.. నచ్చక కానీ.. ఎవరూ కామెంట్లు చేయడం లేదు. ప్రత్యక్షంగా జరుగుతున్న దాడులు, హత్యలను ప్రస్తావిస్తున్నారు. ఇవి ఇలానే కొనసాగితే.. వచ్చే పెట్టుబడులు.. జరగాల్సిన అభివృద్ధిపైనా ప్రభావం పడుతుందని అంటున్నారు పరిశీలకులు.