Begin typing your search above and press return to search.

ఉమ్మడి పోరాటాలు సక్సెస్ అవుతాయా ?

అలాగే 17వ తేదీనుండి ఉమ్మడి కార్యాచరణతో రంగంలోకి దిగాలని రెండు పార్టీలు నిర్ణయానికి వచ్చాయి.

By:  Tupaki Desk   |   10 Nov 2023 1:30 PM GMT
ఉమ్మడి పోరాటాలు సక్సెస్ అవుతాయా ?
X

అధికార వైసీపీ పై ఉమ్మడిగా పోరాటాలు చేయాలని తెలుగుదేశం పార్టీ, జనసేన డిసైడ్ అయ్యాయి. ఇదివరకే ఈ నిర్ణయం తీసుకన్నా విజయవాడలో తాజాగా జరిగిన రెండుపార్టీల నేతల ఉమ్మడి సమావేశంలో కార్యాచరణను కూడా నిర్ణయించారు. ఈనెల 14,15,16 తేదీల్లో ఉమ్మడి కార్యాచారణపై అన్నీ జిల్లాల్లో రెండుపార్టీల కమిటీలు సమావేశమవ్వాలని డిసైడ్ చేశారు. రెండుపార్టీల నేతలు సమావేశమై కార్యాచరణపై తీర్మానాలు చేయబోతున్నాయి. అలాగే 17వ తేదీనుండి ఉమ్మడి కార్యాచరణతో రంగంలోకి దిగాలని రెండు పార్టీలు నిర్ణయానికి వచ్చాయి.

భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఉమ్మడిగా రెండుపార్టీలు అన్నీ జిల్లాల్లో టేకప్ చేయబోతున్నాయి. గల్లీ నుండి ఢిల్లీ స్ధాయి దాకా ప్రతి కార్యక్రమాన్ని ఉమ్మడిగానే నిర్వహించబోతున్నాయి. ఆందోళనలు, నిరసన కార్యక్రమాల ఉమ్మడి కార్యాచరణ వరకూ ఓకేనే. కానీ సీట్ల షేరింగుకు వచ్చేసరికి ఇబ్బందులు తప్పవేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే పొత్తులో సీట్ల సంఖ్య, నియోజకవర్గాలు చాలా కీలకమైనవని అందరికీ తెలిసిందే.

రెండు పార్టీలు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా సీట్ల దగ్గరకు వచ్చేసరికి ఇబ్బందులు తప్పవనే అనుమానాలున్నాయి. ఎందుకంటే రెండుపార్టీలు పోటీచేయాలని అనుకుంటున్న నియోజకవర్గాలు తిరుపతి, బీమిలీ, పిఠాపురం, భీమవరం, విశాఖ ఉత్తరం, పీగన్నవరం, కాకినాడ, పెందుర్తి, రాజమండ్రి, తెనాలి, విజయవాడ సెంట్రల్ లాంటి నియోజకవర్గాలున్నాయి. ఇలాంటి కామన్ నియోజకవర్గాల విషయంలో కూడా సక్రమంగా సర్దుబాట్లు జరిగితే అప్పుడు రెండుపార్టీలు బలమైన ఫోర్సుగా మారుతుందనటంలో సందేహంలేదు. మరి వీటికి వామపక్షాలు కూడా తోడవుతాయా లేదా అన్నదే ఇంకా తేలలేదు.

రెండుపార్టీలు బలంగా కోరుకుంటున్న నియోజకవర్గాల్లో ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు రెండుపార్టీల నేతలు చెబుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాలు, సంఖ్య విషయంలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మధ్య చర్చలు జరిగింది లేనిది తెలీదు. రెండుపార్టీల అధినేతల మధ్య కామన్ పాయింట్ ఏమిటంటే విడివిడిగా పోటీచేయటానికి ఏమాత్రం ఇష్టపడకపోవటమే. కాబట్టి ఏదో పాయింట్ దగ్గర నియోజకవర్గాలు, పోటీచేసే సంఖ్య విషయంలో సర్దుబాటు అవుతుందనే అనుకుంటున్నారు. ఈలోగా ఉమ్మడి కార్యాచరణను ఎంత వీలుంటే అంత బలంగా జనాల్లోకి తీసుకెళ్ళాలన్నదే అజెండాగా పెట్టుకున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.