Begin typing your search above and press return to search.

వైసీపీ నేత‌లు.. బిజీ బిజీ.. విష‌యం తెలిస్తే షాకే..?

రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది నాయకులు ముందస్తు మెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

By:  Tupaki Desk   |   12 July 2024 12:30 AM GMT
వైసీపీ నేత‌లు.. బిజీ బిజీ.. విష‌యం తెలిస్తే షాకే..?
X

రాష్ట్రంలో వైసీపీ నాయకులు బిజీ బిజీగా ఉన్నారు. తీరిక లేకుండా గడుపుతున్నారు. అదేంటి అనుకుంటున్నారా? అధికారం పోయిన తర్వాత బిజీగా ఉండటం ఏంటి ?అని ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది ప్రజల కోసం కాదు. ఇప్పుడు పోలీసుల నుంచి, అరెస్టుల నుంచి, భద్రత కోసం వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పనిలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది నాయకులు ముందస్తు మెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్ర‌మంలోనే వైసిపి నాయకులు న్యాయవాదులు కోర్టుల చుట్టూ తిరిగే పనిలో పడ్డారు.

చంద్రబాబు ఇంటిపై 2021లో దాడి చేసేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి మందస్తు మెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మంగళగిరిలోని టిడిపి కార్యాలయం పై జరిగిన దాడిని ప్రోత్సహించారంటూ విజయవాడకు చెందిన దేవినేని అవినాష్, గుంటూరు కు చెందిన లేళ్ల అప్పి రెడ్డి స‌హా పలువురు నాయకులకు ఇప్పటికే అరెస్టు ప్రమాదం పొంచి ఉంది. దీంతో వీరు కూడా ముందస్తు బయలు కోసం ప్రయత్నం చేస్తున్నారు.

ఇక అప్ప‌టి జ‌గ‌న్ ప్రభుత్వంలో నెంబర్ 2 గా గడిచిన ఇదేళ్ళ పాటు వ్యవహరించిన వైసిపి కీలక నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ముందస్తు బయలు కోసం హైకోర్టును ఆశ్ర‌యించారు. సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకున్నారని, బెదిరించారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తిన‌ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి పై కూడా కేసు నమోదు అయింది. దీంతో ఆయన కూడా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బయలు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

అదేవిధంగా నెల్లూరు జిల్లాకు చెందిన మరికొందరు నాయకులు కూడా ముందస్తు బెయిలు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వైసిపి హయాంలో టిడిపి నాయకులను బెదిరించడం, వారిపై దాడులు చేయటం వంటి ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ఏ క్షణమైనా వారిని అరెస్టు చేసే అవకాశం ఉందని గ్రహించిన నాయకులు.. బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా అధికారం నుంచి దిగిపోయిన నాయకులు.. ఇప్పుడు కోర్టుల చుట్టు తిరుగుతూ బిజీబిజీగా గ‌డుపుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఇక, ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వంసం కేసులో ముందస్తు బయలు పొందారు. కానీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయ‌ణ స్వామి, టిడిపి పోలింగ్ బూత్ ఏజెంట్ శేష‌గిరిలపై ఆత్యాయత్నం చేశారన్న ఆరోపణలతో ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా నెల్లూరు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈయ‌న కూడా ఆయా కేసుల్లో ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.