Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబును కాపాడే ప్ర‌య‌త్నంలో.. మీడియా చేస్తున్న పెద్ద త‌ప్పు..!

ఇక‌, ఏ ప్ర‌భుత్వం ఉన్నా.. కొన్ని కొన్ని త‌ప్పులు జ‌రుగుతూనే ఉంటాయి

By:  Tupaki Desk   |   19 July 2024 5:30 AM GMT
చంద్ర‌బాబును కాపాడే ప్ర‌య‌త్నంలో.. మీడియా చేస్తున్న పెద్ద త‌ప్పు..!
X

రాజ‌కీయాల‌కు-మీడియాకు మ‌ధ్య అవినాభావ సంబంధం ఎవ‌రూ కాద‌నలేనిది! నాలుగు ద‌శాబ్దాలుగా ఈ బంధం బ‌లోపేతం అవుతూనే ఉంది. త‌న వారు కాక‌పోతే.. ఒక‌లా.. త‌న వారే అయితే.. మ‌రోలా వ్య‌వ‌హ‌రి స్తున్న మీడియా క‌ళ్ల‌ముందు క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ దొంగ‌. సైకో. త‌ర్వాత‌.. కూడా ఆయ‌నే దొంగ‌.. ఆయ‌నే సైకో.. ! అన్న విధంగా మీడియా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక‌, ఏ ప్ర‌భుత్వం ఉన్నా.. కొన్ని కొన్ని త‌ప్పులు జ‌రుగుతూనే ఉంటాయి. దానికి ఎవ‌రూ అతీతులు కారు.

సీఎం స్థానంలో ఎవ‌రు ఉన్నా.. చంపుకోమ‌ని చెప్ప‌రు. గొడ‌వ‌లు పెట్టుకోమ‌ని కూడా చెప్ప‌రు. అయినా.. అవి జ‌రిగిపోతాయి. కానీ, జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగితే.. అవి ప్ర‌భుత్వానికి అంట‌గ‌ట్టి ఏకేసిన‌.. మీడియా.. త‌ర్వాత‌.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను కూడా ఆయ‌నకే అంట‌గ‌ట్టేస్తోంది. ఇది .. స‌ద‌రు మీడియా శైలికి బాగానే ఉంటుంది. కానీ, ప్ర‌జా కోణంలో చూసిన‌ప్పుడు.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తున్నామ‌ని చెబుతున్న మీడియాకు మాత్రం స‌హేతుకం కాదు.

ఎందుకంటే.. ఇప్పుడు చంద్ర‌బాబు ను కాపాడాల‌నే రీతిలో ఆయ‌న మెప్పు పొందాల‌ని భావించే మీడియా. . ఆర్థిక వెసులు బాట్ల కోసం..జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను క‌ప్పిపెట్టాల‌ని అనుకుంటున్న మీడియా.. 2019కి ముందు కూడా ఇలానే చేసింది. ఏం జ‌రిగిందో వాస్త‌వాలు చెప్ప‌లేదు. పైగా.. ఎదురు దాడి చేసింది. అప్ప‌ట్లోనూ ప్ర‌తిప‌క్షాన్ని టార్గెట్ చేసుకుని.. ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చింది. ప‌లితంగా.. చంద్ర‌బాబు ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది.

ఇప్పుడు మ‌రోసారి మీడియా అదే త‌ప్పు చేస్తోంది. అన్నింటికీ జ‌గ‌న్‌ను లాగుతోంది. అయితే.. ఇది ప్ర‌జ‌ల ను నమ్ముతార‌ని అనుకుంటే పొర‌పాటే.. సోష‌ల్ మీడియా విజృంభ‌ణ‌తో ఏది ఎక్క‌డ ఎలా జ‌రిగిందో ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా పోలేదు. ఫ‌లితంగా ప్ర‌ధాన మీడియా అనుస‌రిస్తున్న‌తీరు.. గ‌త వారం రోజులుగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చిత్రం ఏంటంటే.. ఈ వారం రోజుల్లో ఒక ప్ర‌ధాన ప‌త్రిక స‌ర్క్యులేష‌న్ 2 ల‌క్ష‌ల‌కు త‌గ్గిపోయింది. మ‌రో ప‌త్రిక సెర్క్యులేష‌న్ 50 వేల‌కు ప‌డిపోయింది. ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగితే.. మున్ముందు ఎవ‌రిని కాపాడుతున్నామ‌ని అనుకుంటున్నారో.. ఆ చంద్ర‌బాబు కూడా.. ఇబ్బందులు త‌ప్ప‌వని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉన్న‌ది ఉన్న‌ట్టు ప్ర‌జెంట్ చేస్తే.. పోయే దానికి దాచ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు.