ఏపీలో ఎనభై శాతం మంత్రులు అవుట్!?
జగన్ ఎలా వ్యూహరచన చేయబోతున్నారు జగన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఆయన డైనమిక్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి ఇవే ఇపుడు విపక్ష శిబిరంలోనూ వేడి వేడి చర్చగా ఉంది.
By: Tupaki Desk | 13 Dec 2023 1:30 PM GMTఏపీ రాజకీయాలను మొత్తం జగన్ తన వైపుకు తిప్పుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇపుడు ఏపీ పాలిటిక్స్ అంతా జగన్ తోనే జగనే అన్నట్లుగా సాగుతోంది. నిజానికి ఇది కూడా జగన్ మార్క్ మాస్టర్ మైండ్ స్ట్రాటజీ అని కూడా చెప్పాలేమో. ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్న వేళ ఎక్కడైనా విపక్షాలే బిగ్ సౌండ్ చేస్తాయి. వారి గురించే అంతటా వినిపిస్తుంది.
అలాంటి వాతావరణమే సెట్ చేసుకుంటారు. ఏపీలో చూస్తే బలమైన ప్రతిపక్షంగా టీడీపీ ఉంది. దానికి ఇంకా బలమైన అనుకూల మీడియా సాయం ఉంది. దాంతో నిరంతరం జనంలో విపక్షం కదలాలి, మెదలాలి. కానీ సీన్ చూస్తే అలా కనిపించడంలేదు. జగన్ వైపే విపక్షం కూడా మొత్తం తిరిగి చూస్తోంది.
జగన్ ఏమి చేయబోతున్నారు. జగన్ ఎలా వ్యూహరచన చేయబోతున్నారు జగన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఆయన డైనమిక్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి ఇవే ఇపుడు విపక్ష శిబిరంలోనూ వేడి వేడి చర్చగా ఉంది. ఇదిలా ఉంటే ఇంతలా విపక్షంతో పాటు ఏపీ రాజకీయాన్ని తన వైపు తిప్పుకున్న జగన్ పాలిటిక్స్ లో కొత్త డైమన్షన్స్ ని అందరికీ పరిచయం చేస్తున్నారు.
ఇప్పటిదాకా భారత రాజకీయాల్లో ఏ జాతీయ పార్టీ మరే పాతుకుపోయిన ప్రాంతీయ పార్టీ సైతం చేయలేని సాహసాలను ఆయన చేస్తున్నారు అని అంటున్నారు. ఏపీలోని మొత్తం పాతిక మంది మంత్రులు జగన్ క్యాబినేట్ లో ఉన్నారు. ఇందులో ఎనభై శాతం మంత్రులకు ఈసారి టికెట్ దక్కదు అని అంటున్నారు. అంటే 20 మంది మంత్రుల దాకా ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయబోవడంలేదన్న మాట.
అంటే నో టికెట్ అని వారికి జగన్ చెప్పబోతున్నారు అని అంటున్నారు. జస్ట్ అయిదారుగురికి మాత్రమే ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ నుంచి టికెట్ దక్కుతాయని అంటున్నారు అంటే జగన్ ఎంత సీరియస్ డెసిషన్ వైపుగా అడుగులు వేస్తున్నారో అర్ధం అవుతోంది అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అన్న ఆలోచనతో జగన్ ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు.
మరీ ముఖ్యంగా తెలంగాణా ఎన్నికల్లో అధికార బీయారెస్ టోటల్ గా నూరు శాతం టికెట్లు సిట్టింగులకు ఇచ్చేసి ఓటమి పాలు అయ్యాక జగన్ మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నారు అని అంటున్నారు. సిట్టింగుల పట్ల జనంలో వ్యతిరేకత ఉంటే కనుక అది కాస్తా అధికారానికి దూరం చేస్తుంది అని తలచిన జగన్ తీవ్రమైన నిర్ణయం దిశగానే అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.
ఈ నేపధ్యంలో చూస్తే పెద్ద ఎత్తున ప్రక్షాళన దిశగానే జగన్ కదులుతున్నారు అని అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న మంత్రులలో ఎనభై శాతం మందిని మార్చేయడానికి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. మంత్రులలో సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. అంతే కాకుండా చాలా మంది కొత్త వారూ ఉన్నారు.
అయితే ఎవరికైనా కొలమానం ఒక్కటే. అదే ప్రజాభిమానం. వారి పనితీరు. ఈ రెండింటిలో మార్కులు తగ్గితే మాత్రం జగన్ ఏ మాత్రం రాజీ పడడంలేదు అని అంటున్నారు. కచ్చితంగా వారిని మార్చి కొత్త ముఖాలను తీసుకుని వస్తారు అని అంటున్నారు. అయితే మంత్రులకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా వారిని ఎంపీలుగా పోటీ చేయించవచ్చు. అదే విధంగా పార్టీలో పెద్ద పీట వేసి రానున్న ఎన్నికల్లో ప్రచారానికి వాడుకోవచ్చు.
ఆ మీదట మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీగానో లేక రాజ్యసభ హామీలో ఇచ్చి వారిని సమాదరించవచ్చు. ఇలా అనేక రకాలైన ఆప్షన్లతో వారిని దారికి తెచ్చి మరీ టికెట్ ఇవ్వకుండా కొత్త ముఖాలను ఆయా నియోజకవర్గాలలో పరిచయం చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఎనభై శాతం మంత్రులకు నో టికెట్ అన్నది ఇపుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అయింది.
బీజేపీ లాంటి జాతీయ పార్టీలు సైతం కర్నాటక ఎన్నికల్లో ఇంతటి సాహసాన్ని చేయలేకపోయాయి. కాంగ్రెస్ లాంటి పార్టీలు అయితే తక్కువ మందిని తీయడానికి సైతం ఆలోచిస్తాయి. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఈ తరహా కసరత్తు పెద్దగా చేయలేకపోయింది అని అంటున్నారు. మరి ఇపుడు వైసీపీ అందరికీ దారి చూపించి సూపర్ సక్సెస్ అవుతుందా అన్నది చూడాల్సి ఉంది.