సంపాదనలో 'భాగ్య'నగరం.. ఫస్ట్: అధ్యయనం వెల్లడి
వ్యక్తి తన జీవితంలో తనపై ఆధారపడేవారిని పోషింగల సొమ్మును నెలకు ఎంత సంపాయించాలో అదే.. సంపాదన అని పేర్కొంది.
By: Tupaki Desk | 25 May 2024 2:30 AM GMTసంపాదన. ఈ మాటకు అంతు లేదు. ఎంత సంపాయిస్తే.. సంపాదన అవుతుంది? అంటే.. దీనికి ఇతమిత్థంగా కొలమానం లేదు. అయితే.. ఆర్థిక శాస్త్రం ఒక అంచనా వేసింది. వ్యక్తి తన జీవితంలో తనపై ఆధారపడేవారిని పోషింగల సొమ్మును నెలకు ఎంత సంపాయించాలో అదే.. సంపాదన అని పేర్కొంది. ఉదాహరణకు ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న వ్యక్తి తన కుటుంబానికి అవసరమైన రీతిలో నెలకు రూ.10 వేల సంపాయిస్తే.. అది సంపాదన అవుతుంది. ఆ కుటుంబం నిశ్చింతంగా నెల రోజులు బతికేస్తుంది.
అదే నగరాల విషయానికివస్తే.. ఈ లెక్క మారుతుంది. ఇలా.. దేశంలోని పలు నగరాల్లో ఉన్న కుటుంబాలు సంపాయిస్తున్న సొమ్మును.. నెలకు వారు చేస్తున్న ఖర్చులను లెక్కగట్టింది.. `హోమ్ క్రెడిట్ ఇండియా` సంస్థ. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం.. దేశంలోని అన్ని నగరాలు.. పట్టణాలతో పోల్చితే.. హైదరాబాద్‌లోనే నెలకు సంపాయించేవారి సంఖ్య, సంపాదన కూడా ఎక్కువగా ఉందని పేర్కొంది.
ఈ సంస్థ లెక్కల ప్రకారం.. దిగువ, ఎగువ, మధ్యతరగతి కుటుంబాల్లో సంపాయిస్తున్న వ్యక్తుల ఆదాయం గత ఏడాదితో పోల్చుకుంటే పెరిగింది. దేశంలో దిగువ మధ్య తరగతి వ్యక్తి నెలవారీ ఆదాయం సగటున రూ.33,000గా ఉందని హోమ్ క్రెడిట్ ఇండియా అధ్యయనం వివరించింది. ముఖ్యంగా భాగ్యనగరంలో జీవిస్తున్నవారి ఆదాయం గత ఏడాదితో పొల్చకుంటే ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. దీంతో హైదరాబాద్ నగరం దేశంలోనే ఫస్ట్‌గా నిలిచిందని తెలిపింది.
సర్వే ఎక్కడెక్కడ చేశారు?
ఆదాయం.. వ్యయానికి సంబంధించిన సర్వేను హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, రాజస్థాన్‌లోని జైపూర్, మహారాష్ట్రలోని వాణిజ్య రాజధాని పుణె, యూపీలోని లఖ్‌నవూ, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, బీహార్‌లోని పట్నా, జార్ఖండ్ రాజధాని రాంచీ, లూథియానా, కోచి సహా 17 నగరాల్లో ఈ సర్వే జరిగింది.
ఎంత మందిపై అధ్యయనం చేశారు.?
దేశవ్యాప్తంగా 18 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల వయస్సున్న సంపాదన పరులను అధ్యయనం చేశారు.
వీరిలో ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం సంపాదిస్తున్న వారు ఉన్నారు.
దాదాపు 2,500 మందిని అధ్యయనం చేశారు.
ఇదీ.. వ్యక్తుల ఆదాయం
ప్రస్తుతం: మెట్రో నగరాల్లో ఉన్న మధ్యతరగతి వ్యక్తులు: రూ.35,000, టైర్-1, టైర్-2 నగరాల్లో ఉన్నవారు నెలకు రూ.32,000 సంపాయిస్తున్నారు. ఇదే హైదరాబాద్‌లో ఉన్న మధ్యతరగతి వ్యక్తులు సగటున నెలకు రూ.44,000 ఆదాయం సంపాదిస్తున్నారు.
2023లో: మెట్రో నగరాల్లో నివశించే దిగువ మధ్యతరగతి వ్యక్తి సగటున రూ.33,000 సంపాయించారు. టైర్-1 నగరాల్లో రూ.30,000, టైర్-2 నగరాల్లో రూ.27,000 సంపాదించారు. హైదరాబాద్‌లో గత ఏడాది వ్యక్తుల సంపాదన రూ.34,000