బీజేపీలో ఓటమి పాలైన త్రయంపై కొనసాగుతున్న చర్చ
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వీరికి సీటు కేటాయిస్తే గెలుస్తారా? మళ్లీ ఓటమి పాలవుతారా? అనేది సందేహంగా మిగులుతోంది.
By: Tupaki Desk | 12 Dec 2023 3:30 PM GMTతెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుంది. గతంలో మాదిరి లేదు పరిస్థితి. ఆ పార్టీ ఊపు కచ్చితంగా కనిపించింది. ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెంచుకుంది. 8 స్థానాల్లో విజయం సాధించింది. ౧౮ శాతం ఓటింగ్ శాతం పెరిగింది. 19 స్థానాల్లో రెండ స్థానంలో నిలిచింది. 49 స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకుంది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు ఓటమి పాలు కావడంపై చర్చ సాగుతోంది. వీరు ఎందుకు ఓడిపోయారనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బీజేపీలో పెద్ద తలకాయలే పరాజయం పాలయ్యారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ లో సోయం బాపురావు దిగ్గజ నేతలుగానే గుర్తింపు పొందారు. దుబ్బాక, హుజురాబాద్ ఎమ్మెల్యేలు విజయరఘునందన్ రావు, ఈటల రాజేందర్ లు సైతం ఓడిపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వీరికి సీటు కేటాయిస్తే గెలుస్తారా? మళ్లీ ఓటమి పాలవుతారా? అనేది సందేహంగా మిగులుతోంది.
అసెంబ్లీలో ఆదరించని వీరిని పార్లమెంట్ ఎన్నికల్లో ఆదరిస్తారా? టికెట్ ఇస్తే పరువు నిలబెడతారా? పరాజయం పాలవుతారా? ప్రస్తుతం అందరిలో వీరి ప్రస్థానంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చిన తరువాత పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా మారిందాని దాని స్థానం కాంగ్రెస్ దక్కించుకుంది. ఈనేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల్లో మహామహులు ఓటమి పాలు కావడం విమర్శలకు తావిచ్చింది.
పార్టీ స్థానాలు పెరిగినా ఓటింగ్ శాతం ఇనుమడించినా బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలు కావడం గమనార్హం. వీరి ఓటమికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. వీరు ఎంపీగా గెలిచాక ఎలాంటి పనులు చేపట్టలేదు దీంతో వారి ప్రస్థానానికి ప్రశ్నగానే మిగిలింది. నియోజకవర్గంలో వీరి వల్ల ఎలాంటి పనులు జరగలేదనే భావన ప్రజల్లో పెరిగింది. దీంతోనే ఓటర్లలో అసహనం కలిగినట్లు భావిస్తున్నారు.
ఈ ముగ్గురు నేతలు అసెంబ్లీ ఎన్నికల్లోనే చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో విజయ దుందుబి మోగస్తారా? లేదా వెన్ను చూపి వెనకకు వస్తారా? అనే కోణంలో అధిష్టానం ఆలోచనలో పడింది. వీరు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సుముఖంగానే ఉన్నా వారికి టికెట్లు కేటాయిస్తారా? లేదో అనేది తెలియడం లేదు.