Begin typing your search above and press return to search.

“లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌”... అసలు ప్రయాణికుల రియాక్షన్ ఇదే!

ఇందులో భాగంగా... శనివారం ఉదయం 10:30 - 11:30 గంటల మధ్య మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకూ నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించి నిరసన తెలపాలని ఫిక్సయ్యారు.

By:  Tupaki Desk   |   14 Oct 2023 10:59 AM GMT
“లెట్స్‌  మెట్రో ఫర్‌  సీబీఎన్‌”... అసలు ప్రయాణికుల రియాక్షన్  ఇదే!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం సుమారు మూడు వారాల తర్వాత ప్రతీ శనివారం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు! ఇందులో భాగంగా ఇప్పటికే "మోత మోగిద్దాం", "కాంతి కాంత్రి " వంటి విభన్నమైన కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ శ్రేణులు.. తాజాగా "లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌" అనే కార్యక్రమాన్ని హైదరాబాద్ లో చేపట్టారు. దీనిపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు!

అవును... స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన చంద్రబాబు కోసం హైదరాబాద్ లో టీడీపీ శ్రేణులు లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌ అనే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా... శనివారం ఉదయం 10:30 - 11:30 గంటల మధ్య మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకూ నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించి నిరసన తెలపాలని ఫిక్సయ్యారు. దీంతో... ఉదయాన్నే నల్ల దుస్తులు ధరించి మెట్రో స్టేషన్ల వద్దకు వెళ్లారు.

దీంతో... హైదరబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రవేశాల వద్ద బందోబస్తు నిర్వహించి నల్ల చొక్కాలు ధరించిన వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో మియాపూర్, మలక్‌ పేట్‌ మెట్రో స్టేషన్‌ సహా అమీర్‌ పేట్‌ లో మెట్ల దారిని సిబ్బంది కాసేపు మూసివేశారు. ఆ తర్వాత ప్రయాణికులను అనుమతించారు. ఈ సమయంలో కొంతమంది నిరసనకారులు సైతం వారితోపాటు మెట్రోలో ప్రయాణించగలిగారు.

ఈ సందర్భంగా నిరసనకారులు... "చంద్రబాబును వెంటనే విడుదల చేయాలి" అని నినదించడం గమనార్హం. రోవైపు ఎల్బీనగర్ మెట్రోస్టేషన్‌ వద్ద బ్లాక్ టీషర్ట్ వేసుకొని వచ్చిన యువకులను పోలీసులు, మెట్రో సిబ్బందీ అడ్డుకోవడంతో.. పక్కనే ఉన్న షాపుల్లోకి వెళ్లి ఇతర రంగు టీషర్ట్‌ లు కొనుగోలు చేసి వచ్చారు. అలా మెట్రో ఎక్కారని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంఘీభావం ప్రకటించారు.

అయితే వీకెండ్ రోజున భార్యా పిల్లాలతో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... మీ నిరసన కార్యక్రమాలకు మెట్రోనే దొరికిందా.. సెలవు రోజే దొరికిందా.. అంటూ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఇదే సమయంలో... ఓపిక ఉంటే విజయవాడలో నిరసన చేయాలి కానీ.. హైదరాబాద్ లో చేయడం ఏమిటంటూ నిరసనకార్లపై చికాకు పడ్డారని సమాచారం!

ఈ ఆదివారం "న్యాయానికి సంకెళ్లు"!:

స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు మద్దతుగా గత రెండు వారాలుగా ప్రతీ శనివారం రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు విభిన్న కార్యక్రమాలతో నిరసన చేపడుతున్నారు టీడీపీ శ్రేణులు. ఇందులో భాగంగా... ఇప్పటికే "మోత మోగిద్దాం", "కాంతి క్రాంతి" వంటి కార్యక్రమాలు చేసిన టీడీపీ ఇప్పుడు మరో కొత్త కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది. కాకపోతే శనివారం కాదు.. ఆదివారం!

అవును... చంద్రబాబు అరెస్టుకు ఇప్పటికే రెండు శనివారాలు రెండు విభిన్న కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ శ్రేణులు... ఈసారి శనివారం కాకుండా ఆదివారానికి మరో కార్యక్రమం ప్లాన్ చేశారు. ఆ కార్యక్రమం పేరు... "న్యాయానికి సంకెళ్ళు"! ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు నారా లోకేష్ ట్విట్టర్ లో వెళ్లడించారు.

"చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేయించి, న్యాయానికి సంకెళ్లు వేసిన జగన్ నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా ఆదివారం (15వ తేదీ) రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలు మధ్యలో చేతులకు తాడు లేదా రిబ్బను, గుడ్డతోనైనా కట్టుకొని నిరసన తెలియజేయండి. న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లని నినదించండి. ఆ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి చంద్రబాబు గారి ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవండి" అని ట్వీట్ చేశారు లోకేష్!