'చదువే లోకంగా బ్రతికింది.. ఒక్క రాత్రిలోనే అంతా'.. వైద్యురాలి తండ్రి ఆవేదన!
ఈ సమయంలో... బాధితురాలి తల్లితండ్రుల వేదన వర్ణనాతీతంగా ఉంది.
By: Tupaki Desk | 22 Aug 2024 12:30 AM GMTకోల్ కతాలోని ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న సమయంలో జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి బలైన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో యావత్ దేశం మరోసారి ఉలిక్కిపడింది. ఇదే సమయంలో దేశం మొత్తం నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ సమయంలో... బాధితురాలి తల్లితండ్రుల వేదన వర్ణనాతీతంగా ఉంది. వారి ఆవేదన దేశ ప్రజలతో కన్నీరు పెట్టిస్తోంది.
అవును... కోల్ కతాలో జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపినట్లు కథనాలు వెలుగులోకి వస్తుండటం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. ఈ క్రమంలో ఇక ఆమె తల్లితండ్రుల పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది!
తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడిన బాధితురాలి తండ్రి మాటలు.. ప్రతీ ఒక్కరితోనూ కన్నీరు పెట్టిస్తున్నాయి. తమ కుమార్తెకు జరిగిన ఘోరంపై ఆమె తండ్రి తాజాగా స్పందించారు. డాక్టర్ అయ్యేందుకు తమ కుమార్తె ఎంతో కష్టపడిందని.. చదువే లోకంగా బ్రతికిందని తెలిపారు. వైద్యవృత్తిలో ఎంతో మందికి సహాయం చేయవచ్చని తమతో ఎప్పుడూ చెప్పేదని ఆయన అన్నారు.
కానీ... ఇప్పుడు ఏమి జరిగిందో చూడండి? కలలన్నీ ఒక్క రాత్రిలోనే చెదిరిపోయాయి అంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విధుల నిర్వహణ కోసం ఆమెను తాము ఆస్పత్రికి పంపిస్తే... ఆస్పత్రి మాత్రం తమకు విగతజీవిగా తిరిగి అప్పగించింది అని ఆయన చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
ఈ క్రమంలోనే... "మా అయ్యాయి ఇక తిరిగి రాదు.. మా పని అయిపోయింది.. ఆమె స్వరాన్ని ఎప్పటినీ వినలేము.. ఆమె చిరునవ్వుని ఎన్నటికీ చూడలేము.. మేము ఇప్ప్డు చేయగలిగింది ఏమైనా ఉంటే అది ఆమెకు న్యాయం జరిగేలా చూడటమే.." అని ఆయన వాపోయారు.