Begin typing your search above and press return to search.

బెంగుళూరులో అతి తక్కువ ఎత్తులో ఆ విమానం ఎందుకు ఎగిరింది?

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   4 April 2024 12:11 PM GMT
బెంగుళూరులో అతి తక్కువ ఎత్తులో ఆ విమానం ఎందుకు ఎగిరింది?
X

గత రెండు రోజుల నుంచి ఓ విమానం అతి తక్కువ ఎత్తులో ప్రయాణించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్ పోర్ట్ పై ఆరు సార్లు చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. విమానం రాకపోకలపై అందరు చర్చించుకుంటున్నారు. అది అంత తక్కువ ఎత్తులో ఎందుకు ప్రయాణిస్తుందని అనుకుంటున్నారు.

ఫ్లైట్ రాడార్ 24 వెబ్ సైట్ ప్రకారం అది కె7067 నంబరున్న బోయింగ్ 777-337 విమానం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వీవీఐపీలు వినియోగించేది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఇది ఢిల్లీ నుంచి వచ్చి బెంగుళూరు ఎయిర్ పోర్ట్ పై తిరిగింది. ఎక్కడ ల్యాండ్ కాకుండానే తిరిగి వెళ్లిపోయింది. ఇందిరానగర్ పై చక్కర్లు కొట్టిందని చెబుతున్నారు. ఇలా చాలా కిందికి వచ్చి ల్యాండ్ కాకుండానే వెళ్లిపోవడంతో ఆశ్చర్యం కలిగింది. ఇది రోజు వస్తోంది. తక్కువ ఎత్తులోనే తిరుగుతోంది.

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ సమయంలో వీవీఐపీల విమానాలు రావు. కానీ దాని కండీషన్ పరిశీలించేందుకు పైలట్లకు శిక్షణ కోసం వినియోగించినట్లు తెలుస్తోంది. ఇలా వీవీఐపీల విమానాలు చెక్ చేసేందుకు ఇలాంటి చర్యలకు దిగుతారు. కానీ ఈ విషయాలు ప్రజలకు తెలియజేయకపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాదు.

బెంగుళూరులో విమానం కింద నుంచి వెళ్లడంతో చాలా మంది దాని గురించే చర్చించుకుంటున్నారు. అంత కింద నుంచి వెళ్లడంతో ప్రజలు ఆసక్తిగా చూశారు. ఎప్పుడు కూడా ఇంత కింద నుంచి విమానాలు వెళ్లడం చూడని వారికి ఇది వింతగానే తోచింది. మొత్తానికి బోయింగ్ విమానం కింద నుంచి రావడం అందరికి అనుమానం కలిగించింది.

ఈ నేపథ్యంలో బోయింగ్ విమానం రాకపోకలు సాగించడం ప్రజలు గమనించారు. కింది నుంచే ఎగరడంతో వేడుకగా చూశారు. గతంలో ఎప్పుడు కూడా ఇలా చూడలేదని మాట్లాడుకున్నారు. కానీ ల్యాండ్ కాకుండానే వెళ్లిపోవడంతో అది ఎక్కడ నుంచి వచ్చిందో? ఎక్కడకు వెళ్లిందో వారికి తెలియలేదు. మొత్తానికి కలగానే విమానం రాక వారికి కనిపించింది.