Begin typing your search above and press return to search.

దువ్వాడ ఎపిసోడ్ లో అనూహ్య ట్విస్టు.. సీన్లోకి ఇంటి ఓనర్!

ఈ మధ్యనే దువ్వాడ శ్రీనుకు ఆయన సతీమణి దువ్వాడ వాణికి మధ్య నెలకొన్న పంచాయితీలోకి రిటైర్డు టీచర్ చింతాడ పార్వతీశం అనే పెద్దాయన సీన్లోకి వచ్చాడు.

By:  Tupaki Desk   |   15 Aug 2024 4:24 AM GMT
దువ్వాడ ఎపిసోడ్ లో అనూహ్య ట్విస్టు.. సీన్లోకి ఇంటి ఓనర్!
X

గడిచిన వారంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ డ్రామా మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఎంతటాన పాపులర్ అయ్యిందో తెలిసిందే. మొన్నటివరకు ఉత్తరాంధ్రకు సుపరిచితుడైన దువ్వా శ్రీనివాస్.. తన వ్యక్తిగత అంశాలు తెర మీదకు రావటం.. సినిమాటిక్ గా ఉన్న ఈ వ్యవహారం పలు మలుపులు తీసుకుంది. ఇంటి గొడవ రచ్చ కావటమే కాదు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లటం.. ఎప్పుడేం జరుగుతుందో? అన్న సందేహాలు వ్యక్తం కావటం తెలిసిందే. ఈ మధ్యనే దువ్వాడ శ్రీనుకు ఆయన సతీమణి దువ్వాడ వాణికి మధ్య నెలకొన్న పంచాయితీలోకి రిటైర్డు టీచర్ చింతాడ పార్వతీశం అనే పెద్దాయన సీన్లోకి వచ్చాడు.

ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు తనదని వాదిస్తున్నాడు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వేరే మహిళతో సన్నిహితంగా ఉన్నాడని.. ఆమెతో కలిసి ఉంటున్నారన్న ఆరోపణ చేసిన సతీమణి దివ్య.. ఆమెను ఇంట్లోకి కూడా రానివ్వకుండా చేసిన దువ్వాడ శ్రీను వ్యవహారం అందరి చూపు పడేలా చేసింది. అనంతరం పలు అంశాలు చోటు చేసుకున్నాయి. కుటుంబంలో కూర్చొని తేల్చుకోవాల్సిన అంశాలు.. రోటీన్ కు భిన్నంగా బయటకు రావటం.. రచ్చ రచ్చగా మారాయి.

దీంతో.. ఈ భార్యభర్తలకు దగ్గరగా ఉంటూ ఉండే వారు ఈ ఇద్దరి గొడవకు ఫుల్ స్టాప్ పడేలా రాయబారాలు షురూ చేశారు. వీరి జాబితాలో అన్ని అంశాలు సెటిల్ అయినప్పటికీ.. అనూహ్యంగా శ్రీనివాస్ ఇంటి విషయంలో పీట ముడులు పడుతున్నాయి. వీరిద్దరి పంచాయితీలోకి వచ్చిన పార్వతీశం పలు అంశాల్ని వెల్లడించారు. దువ్వాడ ఉంటున్న ఇంటి స్థలం తనదేనని చింతాడ పార్వతీశం స్పష్టం చేస్తున్నారు. ఇంటికి సంబంధించి రూ.60 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నాడు. ఆ బకాయికి సంబంధించి ఇచ్చిన బ్లాంక్ చెక్ ఇప్పటివరకు చెల్లుబాటు కాలేదన్నాడు.

తన ఇంటి విషయంలో దువ్వాడ తనకు ఇవ్వాల్సిన రూ.60 లక్షలు ఆపేసి.. ఇప్పుడు ఆ ఇంటిని మరొకరికి ఎలా బదిలీ చేస్తారన్నది ఆయన ప్రశ్న. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చే వరకు ఇంటిని షేర్ చేసుకునేందుకు వీలుగా లేదని తేల్చేశారు. తన సతీమణి దువ్వాడ వాణి డిమాండ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీనివాస్ కు.. తాజాగా పార్వతీశం ఎంట్రీతో మరిన్ని చిక్కుముడులు పడినట్లేనని చెబుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటిని తమ కూతురి పేరు మీద రాయాలని వాణి కోరుతోంది. అందుకు శ్రీనివాస్ నో అంటున్న పరిస్థితి. ఇలాంటి వేళలోనే పార్వతీశం ఎంట్రీ ఇచ్చి తనకు ఇవ్వాల్సిన డబ్బులు తనకు ఇవ్వాలంటూ పట్టుబడటం ఇప్పుడు ఇష్యూ మరోలా మారిందంటున్నారు.