Begin typing your search above and press return to search.

రాజశ్యామయాగం : ఫలితం దక్కిందెవరికంటే...

తిరిగి మూడవసారి ముఖ్యమంత్రిగా గెలిచి సౌతిండియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలని కేసీఆర్ 2023 నవంబర్లో మూడవసారి రాజశ్యామల యాగం చేశారు.

By:  Tupaki Desk   |   7 Dec 2023 3:45 AM GMT
రాజశ్యామయాగం : ఫలితం దక్కిందెవరికంటే...
X

రాజకీయాల్లో అనేక పోకడలు ఉంటాయి. ప్రతీ ఎన్నికకూ కొత్త రకం పంధాను నేతలు అనుసరిస్తారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. దాంతో ఆయన 2014 నుంచి 2023 మధ్యలో మూడు సార్లు రాజశ్యామల యాగం చేశారు. మొదటిసారి 2015లో కేసీయార్ యాగం చేశారు. అప్పట్లో ఆయన ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని యాగం చేశారు.

ఆ తరువాత 2018లో ముందస్తు ఎన్నికల ముందు మరోసారి రాజశ్యామల యాగం చేశారు. ఈసారి ఆయన విజయవంతంగా రెండవసారి ముఖ్యమంత్రి అయిపోయారు. తిరిగి మూడవసారి ముఖ్యమంత్రిగా గెలిచి సౌతిండియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలని కేసీఆర్ 2023 నవంబర్లో మూడవసారి రాజశ్యామల యాగం చేశారు. తన సొంత వ్యవసాయ క్షేత్రంలో రోజుల పాటు కేసీఆర్ యాగం చేశారు. భక్తిపూర్వకంగా చేసిన ఈ యాగం ఫలితం మాత్రం ఇచ్చినట్లుగా కనిపించలేదు అని అంటున్నారు.

అయితే కేసీఆర్ చేసిన ఈ యాగం వల్ల బలమైన ప్రతిపక్షంగా మాత్రం బీఆర్ఎస్ నిలిచింది. ఈ యాగం వల్ల కేసేఆర్ కి ఈ ఫలితం దక్కింతే కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి తన సొంత నివాసంలో ఎన్నికలు చివరలో ఉండగా రాజశ్యామల అమ్మవారిని తలచుకుంటూ యాగం చేశారు. సతీసమేతంగా రేవంత్ రెడ్డి ఈ యాగంలో పాల్గొన్నారు. మనవడిని సైతం ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుని యాగం చేశారు.

అలా ఈసారి రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం రేవంత్ రెడ్డికి దక్కింది అని అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రం. సీఎం ల రేసులో చాలా మంది ఉంటారు. అయినా సరే రేవంత్ రెడ్డిని రాజ్యలక్ష్మి వరించింది అంటే రాజశ్యామల అమ్మ వారి కరుణ అని అంటున్నారు. దాంతో యాగఫలం రేవంత్ రెడ్డిదని అంతా అనుకుంటున్నారు.

ఏపీలో చూసుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా 2019 లో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఆ మీదట ఆయన ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి దించేసి బంపర్ మెజారిటీతో సీఎం అయ్యారు. ఇక ఇదే ఏడాది విజయవాడలో వారం పది రోజుల పాటు రాజశ్యామల అమ్మవారి యాగంతో పాటు దేవీ దేవతలకు హోమాలు పూజలు జరిగాయి. దేవాదాయ శాఖ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు.

రేపటి ఎన్నికల్లో అధికారం కోసమే ఈ యాగం అని విపక్షాలు విమర్శించాయి. 2024లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి జగన్ కి ఈసారి రాజశ్యామల అమ్మ వారి కరుణ ఏ స్థాయిలో ఉంటుంది అన్నది ఒక చర్చగా ఉంది. మరో వైపు తెలుగుదేశం పార్టీ కూడా సరైన సమయం చూసి యాగాలు చేస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.