జమిలికి రెడీ... బాబుకు సవాళ్లు ఇవే ..!
ఆ దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కూడా చంద్రబాబు ఆదేశించారు.
By: Tupaki Desk | 20 Oct 2024 4:00 AM GMTజమిలి ఎన్నికలకు సిద్దమవుతున్న అంశాన్ని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మరోసారి పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో చేపట్టిన సమావేశంలో పేరు ఎత్తకుండా.. ఎప్పుడైనా ఎన్నిక లకు సిద్ధంగా ఉండాలన్నారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. పరోక్షంగా అయినా.. ప్రత్యక్షంగా అయినా.. చంద్రబాబు ఉద్దేశం ఒక్కటే జమిలికి రెడీ!
ఈ దిశగానే చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తే.. ఆయనకు సవాళ్లు ఎదురు కానున్నాయి. సాధా రణ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాల్సి ఉంది. సూపర్ సిక్స్ నుంచి అనేక అంశాలను అన్నో ఇన్నో.. ఎన్నో కొన్ని.. అన్నట్టుగా చంద్రబాబు సర్కారు నెరవేర్చాలి. అనంతరం.. రాజధాని విష యంలో పక్కా చట్టాలు చేయాల్సి ఉంది. అలానే.. పోలవరం ప్రాజెక్టు, నిరుద్యోగం, ఉపాధి వంటి అంశా లను కూడా.. చూడాలి. మహా అయితే.. చంద్రబాబుకు ఉన్న సమయం రెండేళ్లు మాత్రమే.
ఈ నేపథ్యంలో పథకాల విషయంలో ఇచ్చిన హామీలను పరిపూర్ణంగా కాకపోయినా.. అంతో ఇంతో నెరవే ర్చక తప్పదు. కానీ, వీటిని సాధించాలంటే.. ప్రజలను సంతృప్తి దిశగా నడిపించాలంటే.. మాత్రం చంద్ర బాబుకు ఇబ్బందులు తప్పవు. ఇక, మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో తమ్ముళ్ల దూకుడును తగ్గించుకోవాలి. సీఎంగా చంద్రబాబుకు తెలియని తమ్ముళ్ల వేషాలు లేవు. అయినా.. ఆయన మౌనంగానే ఉంటున్నారు. ఏదో సుతిమెత్తగా మాత్రమే వారిని లైన్‌లో పెడుతున్నారు.
దీనివల్ల ప్రయోజనం లేదు. 2019 ఎన్నికలకు ముందుకూడా ఇలానే జరిగింది. ``క్షేత్రస్థాయిలో.. నియోజ కవర్గాల్లో తప్పులు జరిగాయి. నేను ఒప్పుకొంటున్నా. కానీ, ఇకమీదట తప్పులు జరగకుండా చూసుకుంటా. నన్ను నమ్మండి`` అని గురజాల ఎన్నికల సభలో చంద్రబాబు వంగి వంగి దణ్ణాలు పెట్టిన దృశ్యం గుర్తుండే ఉంటుంది. సో.. అలాంటి పరిస్థితి ఇప్పుడు రాకుండా చూసుకుంటే.. తమ్ముళ్లను లైన్‌లో పెట్టుకుని ముందుకు సాగితే.. పథకాల్లో కొన్నయినా అమలు చేస్తే.. జమిలి ఎప్పుడు వచ్చినా.. జయ కేతనం ఎగరేయొచ్చు అనేది విశ్లేషకుల మాట.