మూడు ముళ్లు.. మా‘విడాకులు’.. మూడేళ్లలో డైవోర్సీలు వీరే
ఇక అభిప్రాయ భేదాలతో విడిపోయే వారెందరో? మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇలాంటి ఉదాహరణలు బోలెడు.
By: Tupaki Desk | 11 Sep 2024 7:30 PM GMT''పెళ్లంటే.. పందిళ్లు.. సందళ్లు.. సప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు..'' త్రిశూలం సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ఇది. తెలుగునాట అత్యంత పాపులర్ సాంగ్. అయితే, పెళ్లి అందరి విషయంలో ఒకేలా ఉండదు. కొందరి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. ఇక అభిప్రాయ భేదాలతో విడిపోయే వారెందరో? మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇలాంటి ఉదాహరణలు బోలెడు. సినీ, క్రీడా రాజకీయ రంగాల్లోని ప్రముఖులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది.
కరోనా తర్వాతనే..
యాక్సిడెంటల్ గానో.. మరేదో కానీ.. కరోనా తర్వాతనే ప్రముఖుల విడాకుల కేసుల అధికంగా ఉన్నాయి. వీరిలో సినీ రంగం వారే అధికం కావడం గమనార్హం. ఇక తర్వాతి స్థానం క్రీడాకారులది. తెలుగు జంటలు కూడా ఈ జాబితాలో ఉండడం గమనార్హం. ఇక జంటల పేర్లు చెప్పుకొంటూ పోతే.. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్, ఖాన్ త్రయంలని ఆమీర్ ఖాన్-తెలుగు మూలాలున్న కిరణ్ రావు, నవాజుద్దీన్ సిద్ధీఖీ-అలియా సిద్దిఖీ, హనీ సింగ్-షాలినీ, సొహైల్ ఖాన్-సీమా సచ్ దేవ్, జీవీ ప్రకాశ్-సైంధవిలు తమ వైవాహిక జీవితంలో కలిసి ఉండలేమని విడిపోయారు. కాగా, తాజాగా తమిళ నటుడు జయం రవి.. తాను ఆర్తితో వేరుపడినట్లు ప్రకటించారు. వీరు 2009లో చేసుకున్నారు. ఇద్దరు కుమారులు ఉన్నారు.
తెలుగు, తమిళంలో సంచలనం
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో ధనుష్. పైగా ఈయన పెళ్లాడింది సౌతిండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్యను. చాలా చిన్న వయసులోనే వీరి వివాహమైంది. 2004లో కేవలం 21 ఏళ్ల వయసులోనే తన కంటే సరిగ్గా ఏడాది చిన్నదైన ఐశ్వర్యను పెళ్లాడిన ధనుష్.. 2022 జనవరిలో తన విడాకుల ప్రకటన చేశారు. ఆ ప్రక్రియ మొన్నటివరకు కొనసాగి పూర్తయింది. పలు భాషల్లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న సమంత.. అక్కినేని నట వారసుడు నాగ చైతన్యన 2017లో వివాహమడారు. కానీ, 2021లో విడిపోయారు. మరోవైపు తెలుగు సినీ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక, ఐపీఎస్ అధికారి కుమారుడైన చైతన్యల వివాహ బంధం మూన్నాళ్ల కూడా నిలవలేదు.
క్రీడా జంటలూ ఔట్
టీమ్ ఇండియా కెప్టెన్ స్థాయికి ఎదిగిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా. కానీ, ఇటీవల వీరి బంధం ముగిసింది. నటాషా కుమారుడిని తీసుకుని సెర్బియా వెళ్లిపోయింది. భారత్ కు ఎన్నో విజయాలు అందించిన ఓపెనింగ్ బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ అనూహ్యంగా తనకంటే వయసులో పెద్దదైన అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న ఆయేషాను వివాహమాడాడు. ఆయేషాకు అప్పటికే పిల్లలున్నారు. ధావన్-ఆయేషాలకు కుమారుడు జొరావర్ పుట్టాడు. కానీ, 2021లో విడిపోయారు. టెన్నిస్ లో భారత్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సానియా మీర్జా.. పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ను 2010లో వివాహం చేసుకుంది. వీరు ఈ ఏడాది మొదట్లో వేరయ్యారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.