ఈ శునకాలు వెరీ డేంజర్.. నిషేధం విధించిన కేంద్రం!
ఇదే సమయంలో... పశుసంవర్ధక కమిషనర్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీ.. అటువంటి కుక్కల జాతుల దిగుమతిని నిషేధించాలని సిఫార్సు చేసింది.
By: Tupaki Desk | 14 March 2024 7:30 AM GMTప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతూ వారి మరణాలకు కారణమవుతున్న సుమారు 23 జాతులకు చెందిన పెంపుడు శునకాల అమ్మకాలపై నిషేధం విధించాలంటూ రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ 23 బ్రీడ్స్ అత్యంత ప్రమాదకరమైనవని, వాటి బ్రీడింగ్ ని నిలిపివేయాలని రాష్ట్రాలను ఆదేశిమింది. దాడులకు ఎక్కువగా పాల్పడే విదేశీ కుక్క జాతులను అమ్మడం, పెంచడాన్ని నిషేధించాలని కేంద్రం తెలిపింది.
అవును... మనిషి ప్రాణాలకు ప్రమాదకరం అయిన కొన్ని జాతుల కుక్కలను పెంచడం, అమ్మడం కోసం ఎలాంటి లైసెన్సులు, అనుమతులు జారీ చేయకుండా చూసుకోవాలని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఇదే సమయంలో... పశుసంవర్ధక కమిషనర్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీ.. అటువంటి కుక్కల జాతుల దిగుమతిని నిషేధించాలని సిఫార్సు చేసింది.
ఇటీవల కాలంలో చట్టవిరుద్ధమైన డాగ్ ఫైటింగ్ కోసం సమాజంలోని దోపిడీకి గురవుతున్న కుక్కలను, తరచూ మనిషికి ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో పిల్లలను, వృద్ధులను రక్షించాలని పీపుల్స్ ఫర్ ది ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్ (ఫెటా) ఇండియా నుంచి విజ్ఞప్తి చేసిన తర్వాత ఈ చర్య మొదలవ్వడం గమనార్హం!
ఈ సందర్హంగా కేంద్రం నిషేధం విధించిన కుక్కల జాతులు ఈ విధంగా ఉన్నాయి... అమెరికన్ బుల్ డాగ్, అమెరికన్ స్టాఫర్డ్ షైర్ టెర్రియర్, డోగో అర్జెంటీనో, సెంట్రల్ ఆసియన్ షెఫర్డ్, సౌత్ రష్యన్ షెఫర్డ్, జపనీస్ తోసా, మాస్కో గార్డ్, పిట్ బుల్ టెర్రియర్, రోట్ వీలర్, టొసా ఇను, మస్టిఫ్స్, టోర్న్ జాక్, వూల్ఫ్ డాగ్స్, బాండోగ్, సర్ప్లానినాక్, ఫిలా బ్రసిలెరియో, అకిటా, బోయర్ బోయెల్, మాస్టిఫ్స్, కంగల్, రోట్ వీలర్స్, రోడేసియన్ రిడ్జ్ బ్యాక్, కానారియో తదితర జాతులను కేంద్రం బ్యాన్ చేసింది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పశుసంవర్ధక శాఖ లేఖలు రాసింది. ఇందులో భాగంగా... పరులు, పౌర సంస్థలతో పాటు జంతు సంరక్షణ సంస్థల నుంచి వచ్చిన పలు వినతులను పరిశీలించిన అనంతరం నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.