నల్లారి మరోసారి జాక్ పాట్ కొట్టినట్లే !?
ఆయనకు అపుడు లక్ వేయింతలు ఫేవర్ చేసింది.
By: Tupaki Desk | 17 Jun 2024 11:30 AM GMTఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఏపీ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి జాక్ పాట్ కొట్టినట్లే అని అంటున్నారు. ఆయన వైఎస్సార్ మరణానంతరం అనూహ్యంగా సీఎం ఎలా అయ్యారో అందరికీ తెలిసిందే. ఆయనకు అపుడు లక్ వేయింతలు ఫేవర్ చేసింది.
ఆపోజిట్ లో జగన్ ఉంటే ఆయన్ని ఎదుర్కోవాలని నల్లారికి సీఎం పదవిని కట్టబెట్టారు. ఆయన ఆ విషయంలో ఎంతవరకూ సక్సెస్ అయ్యారో తెలియదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో కూలిపోకుండా పూర్తి కాలం పనిచేశారు. ఆ విధంగా ఆయన తనకు అప్పగించిన పనిని పూర్తి చేశారు.
ఇక కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నల్లారి 2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీగా కూటమి తరఫున పోటీ చేసి వైసీపీ ఎంపీ అభ్యర్ధి మిధున్ రెడ్డి చేతిలో 76 వేల ఓట్ల తేడాతో ఓటమి చూసారు. దాంతో కూటమి నుంచి ఆయన గెలిచి ఉంటే కచ్చితంగా కేంద్రంలో క్యాబినెట్ మంత్రి అయి ఉండేవారు అని అంతా అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్ గా కిరణ్ ఓటమి జరిగింది.
అయితే ఈ ఆరున్నర పదుల రాజకీయ నేత జాతకం ఇంతటితో ముగిసిపోలేదు అని అంటున్నారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ పొలిటికల్ గా కంటిన్యూ అవుతాయని కూడా అంటున్నారు. కిరణ్ పట్ల అటు బీజేపీ పెద్దలకు సానుభూతి ఉంది. ఆయన అనుభవం పట్ల రాజకీయంగా ఆయనకు ఉన్న అవగాహన పట్ల కేంద్ర పెద్దలకు గట్టి విశ్వాసం ఉందిట.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు సైతం కిరణ్ కి వీలైతే ఏదైనా పదవి ఇవ్వాలనే కోరుతున్నారు. ఈ నేపధ్యంలో కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణా గవర్నర్ గా నియమిస్తారు అన్న ఊహాగానాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. తమిళనాడు కి చెందిన తమిళ్ సై గవర్నర్ గా రాజీనామా చేశాక ఆ పదవి అప్పటి నుంచి ఖాళీగా ఉంది. ఇంచార్జితో నడిపిస్తున్నారు.
దాంతో కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా తెలంగాణా రాజ్ భవన్ లోకి పంపుతారు అని అంటున్నారు. తెలంగాణాలో బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలిచి మంచి జోరు మీద ఉంది. 2023 ఎన్నికలను టార్గెట్ చేస్తోంది. ఈసారి కచ్చితంగా తెలంగాణా పీఠం అందుకోవాలని బీజేపీ చూస్తోంది. దాంతో అన్ని విధాలుగా అనుభవం ఉన్న కిరణ్ తెలంగాణా గవర్నర్ అయితే బీజేపీకి మేలు అవుతుందని ఆలోచిస్తున్నారుట.
తెలంగాణా రాజకీయాల మీద కిరణ్ కుమార్ రెడ్డికి పూర్తి అవగాహన ఉండడం కూడా ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారుట. ఈ పరిణామాల నేపధ్యంలో తొందరలోనే నల్లారి వారు రాజ్ భవన్ లోకి ప్రవేశిస్తారు అని అంటున్నారు. సౌమ్యుడు వివాదరహితుడు రాజకీయ వ్యూహాలలో దిట్ట అయిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ ని చేయడం ద్వారా తెలంగాణాలో కాగల కార్యాన్ని నెరవేచుకోవడానికి బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే జాఇ పాట్ సీఎం అని ప్రత్యర్ధుల చేత విమర్శలు వచ్చినా మూడేళ్ల పాటు ఉమ్మడి సీఎం పదవిని గట్టిగా పనిచేసి ఎన్నో సమస్యలను నిభాయించుకుని వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ పోస్టుతో మరో జాక్ పాట్ కొట్టబోతున్నారు అని అంటున్నారు. ఈ పదవిలో సైతం ఆయన రాణిస్తారు అని అంటున్నారు.