బుద్దా బలం ఎంత... చంద్రబాబు ఆరా!
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకుంటున్నానని.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ను ఆశిస్తున్నానని బుద్దా చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 14 Dec 2023 2:30 PM GMTవిజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక న్న వ్యవహారంపై చంద్రబాబు దృష్టి పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లా ల పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్న బుద్దా వెంకన్న.. ఇటీవల హాట్ కామెంట్స్ చేశారు. నిజానికి ఆయన చంద్రబాబు ఎంత చెబితే అంతే అంటూ.. గతంలో మాట్లాడిన బుద్దా.. ఇటీవల మాత్రం రివర్స్ గేర్ వేశారు.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకుంటున్నానని.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ను ఆశిస్తున్నానని బుద్దా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఈ టికెట్ ఇస్తే.. సరే, లేకపోతే తన దగ్గర ప్లాన్ బీ. ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు టీడీపీలో కీలక నేతగా ఎదిగిన బుద్దా ఒక్కసారిగా ఇలా రివర్స్ అయ్యేసరికి.. పార్టీలోనూ విస్మయం వ్యక్తమైంది.
బుద్దా వ్యాఖ్యలను కొందరు లైట్ తీసుకోగా, మరికొందరు మాత్రం సీరియస్‌గానే చర్చిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, పార్టీకి బీసీలు కీలకమైన ఓటు బ్యాంకుగా ఉండడం, మరోవైపు.. ఈ ఓటు బ్యాంకును విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుండడంతో బుద్దా వ్యవహారంపై చంద్రబాబు దృష్టిసారించారు. నియోజకవర్గంలోనూ.. విజయవాడ నగరంలోనూ బుద్దా బలం ఎంతో తేల్చాలని.. అంతర్గత చర్చల్లో ఆదేశించినట్టు తెలిసింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీసీలు తక్కువగానే ఉన్నారు. ఓసీలు, మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో బుద్దా బలాన్ని అంచనా వేయడం, ఆయనకు జై కొట్టే నాయ కులను లెక్కగట్టడం వంటివి ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అయితే, వీటిని పరిగణనలోకి తీసుకు న్నా.. టికెట్ ఇస్తారా? ఇవ్వరా? అనేది మాత్రం సందేహంగానే ఉంది. అయితే.. కీలకమైన నాయకుడిని సంతృప్తి పరిచేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా ఇలా అడుగులు వేస్తున్నారనేది చర్చ.