Begin typing your search above and press return to search.

జమ్ముకశ్మీర్ లో జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందే

దేశంలో దశాబ్దాల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు పుణ్యమా అని కశ్మీర్ అంశంపై పీట ముడులు వేయటమే తప్పించి

By:  Tupaki Desk   |   14 Jun 2024 12:30 PM GMT
జమ్ముకశ్మీర్ లో జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందే
X

నా భరతమాత నుదిటి సింధువు జమ్ముకశ్మీర్ అంటూ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వారు చాలా గొప్పగా జమ్ముకశ్మీర్ గురించి చెప్పుకుంటారు. అయితే.. కొంత కాలం క్రితం వరకు కూడా జమ్ముకశ్మీర్ కు వెళ్లిన చాలామందికి.. మీది భారతదేశం.. మాది కశ్మీర్ అంటూ శ్రీనగర్ తో పాటు.. లోయలోని పలు ప్రాంతాల్లోని కశ్మీరీలు కొందరి నోటి నుంచి వచ్చే మాటల్ని విన్నప్పుడు.. అదేంట్రా అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. దేశంలో దశాబ్దాల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు పుణ్యమా అని కశ్మీర్ అంశంపై పీట ముడులు వేయటమే తప్పించి.. వేసిన పీటముడుల్ని విప్పదీసి.. దేశంలో భాగంగా కశ్మీర్ ను కలపకపోవటం కాస్తంత చిత్రంగా.. చికాకును కలిగిస్తుంది.

మోడీ పదేళ్ల కాలంలో ఏం చేశారు? ఏం చేయలేదన్నది పక్కన పెడితే.. రాచపుండుగా మారిన జమ్ముకశ్మీర్ ఇష్యూను ఒక కొలిక్కి తీసుకురావటమే కాదు.. అక్కడి కొన్ని రాజకీయ కుటుంబాల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి.. భావోద్వేగ రాజకీయాలతో నిత్యం నిప్పుల గుండంగా ఉండే కశ్మీర్ ను ఒక కొలిక్కి తీసుకురావటం తెలిసిందే. ఆర్టికల్ 370 విషయంలో కశ్మీర్ ను దేశంలో భాగంగా కాకుండా ప్రత్యేకంగా చూపించే అధికరణం విషయంలో చేయాల్సిన శస్త్రచికిత్స చేయటం తెలిసిందే.

ఇప్పుడు దేశంలోని మిగిలిన రాష్ట్రాల మాదిరి జమ్ముకశ్మీర్ దేశంలో పూర్తిగా భాగం కావటం తెలిసిందే. తాజాగా వెలువడిన ఒక ఉత్తర్వు పుణ్యమా అని జమ్ముకశ్మీర్ ను దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరి ఒకే విధానాన్ని అమలు చేసే తీరు చూసినప్పుడు కాస్తంత ఆనందంతో పాటు.. ఊరట కలిగిస్తుందని చెప్పొచ్చు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని విద్యార్థులు తమ ప్రార్థన సమయంలో జాతీయ గీతాన్ని తప్పనిసరిగా పాడాల్సి ఉంటుందన్న నియమాన్ని స్పష్టం చేస్తూ ఉత్తర్వలు జారీ చేశారు. ఇప్పటివరకు జమ్ముకశ్మీర్ లోని పాఠాశాలల్లో జాతీయ గీతాన్ని కచ్ఛితంగా ఆలపించాలన్న రూల్ లేదు.

దీనిపై తాజాగా అక్కడి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం నిర్వహించే అసెంబ్లీలో విద్యార్థుల మధ్య ఐక్యత.. క్రమశిక్షణ పెంపొందిస్తుందని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అంతేకాదు.. విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు వీలుగా వక్తలను కూడా ఆహ్వానించాలని సూచన చేశారు. అంతేకాదు సమాజంలోని పరిస్థితులు.. భిన్నమైన సంస్క్రుతులు.. చారిత్రక అంశాలు.. పర్యావరణంతో సహా మొత్తం 16 అంశాల్ని స్కూళ్లల్లో తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.