Begin typing your search above and press return to search.

గంటాకు నో చెబుతున్న ఆ రెండు పార్టీలు...!

అధినాయకత్వం గంటాకు చీపురుపల్లి వెళ్లమని చెప్పినా ఆయన పట్టు వదలని విక్రమార్కుడిగ భీమిలీ సీటు మీదనే ఫోకస్ పెట్టేశారు.

By:  Tupaki Desk   |   31 March 2024 1:30 AM GMT
గంటాకు నో చెబుతున్న ఆ రెండు పార్టీలు...!
X

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు తన పంతాన్ని సాధించారు. ఆయన భీమిలీ నుంచే పోటీ చేస్తాను అని చెప్పారు. దానికి తగినట్లుగా ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. అధినాయకత్వం గంటాకు చీపురుపల్లి వెళ్లమని చెప్పినా ఆయన పట్టు వదలని విక్రమార్కుడిగ భీమిలీ సీటు మీదనే ఫోకస్ పెట్టేశారు. అనుకున్నది అయితే సాధించారు.

అయితే గంటాకు ఇపుడు భీమిలీ సీటు క్యాట్ వాక్ నా అంటే కాదు అంటున్నాయి అక్కడ స్థానిక రాజకీయ పరిణామాలు. భీమిలీలో జనసేన ఇదే సీటు మీద కోటి ఆశలు పెట్టుకుంది 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేశారు పంచకర్ల సందీప్. ఆయన సోలోగానే జనంలోకి వెళ్ళి పాతిక వేల దాకా ఓట్లు సాధించారు. ఇపుడు పొత్తులో ఆయనకే సీటు అనుకున్నారు. సీటు దక్కితే కనుక సందీప్ ఎమ్మెల్యే అవుతారు అని ఆయన అనుచరులు అభిమానులు ఆశించారు.

తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది. సందీప్ కే సీటు ఇవ్వాలంటూ చాలా కాలంగా వారంతా కోరుతున్నారు. మీడియా ముందుకు వచ్చి డిమాండ్ చేశారు. కానీ గంటా ఈ సీటు తీసుకోవడంతో జనసేన నేతలు అగ్గి మీద గిగ్గిలం అవుతున్నారు. గంటాను ఓడిస్తామని అంటున్నారు. ఇప్పటికైనా అధినాయకత్వం పునరాలోచన చేసి భీమిలీ సీటు జనసేనకు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

దీని మీద పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన తరువాత ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని సందీప్ అంటున్నారు. మొత్తానికి అయితే గంటాకు సీటు ఇవ్వడం పట్ల మిత్రపక్షం జనసేన అయితే మండిపోతోంది అని అర్ధం అవుతోంది. ఇక సొంత పార్టీలో చూస్తే భీమిలీ టీడీపీ ఇంచార్జ్ గా కోరాడ రాజబాబు ఉన్నారు. ఆయన టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన గతంలో ఎంపీపీ గా పనిచేశారు.

తనకే ఎమ్మెల్యే టికెట్ అని ఆయన గట్టిగా నమ్మారు. తీరా చూస్తే గంటాకే ఆ సీటు వెళ్ళింది. దాంతో ఏమి చేయాలి అన్న దాని మీద కోరాడ రాజబాబు తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. ఆయనకు టికెట్ ఇప్పించాలని టీడీపీలోనే గంటాను వ్యతిరేకించే మరో వర్గం గట్టిగా ప్రయత్నాలు చేసింది అని అంటున్నారు. కానీ గంటా ఎత్తుకు పై ఎత్తు వేసి మరీ టికెట్ సాధించారు.

సరే టికెట్ దక్కింది కానీ ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నట్లుగా గంటా ఇపుడు సొంత పార్టీలో అసంతృప్తులను అలాగే జనసేనలోని ఆగ్రహాన్ని ఎలా చల్లార్చుకుంటారు అన్నది చర్చగా ఉంది. అదే టైం లో అన్ని వర్గాలనూ కలుపుకుని వైసీపీని ఢీ కొట్టాల్సి ఉంది అని అంటున్నారు. గంటాకు ఈ పరిణామాలు సవాల్ గానే ఉన్నాయని అంటున్నారు.

మామూలుగా గంటాకు టికెట్ తొలి విడతలో ఇచ్చేసి ఉంటే అసంతృప్తులు ఎన్ని ఉన్నా ఆయనకు హై కమాండ్ తానుగా టికెట్ ఇచ్చింది అని సర్దిచెప్పుకొని పనిచేసేవారు. కానీ భీమిలీ టికెట్ విషయంలో గంటా టికెట్ మీద పెద్ద కధ నడచింది. ఆయనను చీపురుపల్లి వెళ్లమని కూడా కోరారు అని అంటున్నారు. దాంతో గంటా పట్టుబట్టి హై కమాండ్ మీద ఒత్తిడి తెచ్చి మరీ టికెట్ తెచ్చుకున్నారు అన్న భావన సొంత పార్టీలోనూ జనసేనలోనూ వెళ్ళిపోయింది.

ఈ సమయంలో వారిని మచ్చిక చేసుకుని ముందుకు సాగడం కొంత కష్టం అని అంటున్నారు అయితే గంటా సమర్ధ నేతగా ఉన్నారు. ఇలాంటివి అన్నీ ఆయన చాలా చాకచక్యంగా పరిష్కరించుకో గలరు అని అంటున్నారు. ఏది ఏమైనా భీమిలీలో రెండు పార్టీలలో నెలకొన్న అసంతృప్తికి కళ్లెం వేసి ప్రచారాన్ని గంటా జోరెత్తించడం ముందున్న సవాల్ అని అంటున్నారు.