Begin typing your search above and press return to search.

ఇలా కూడా చంపేస్తారా? ర‌ష్యా ఘ‌ట‌న‌పై ప్ర‌పంచం విస్మ‌యం!

అయితే.. ఆ చంప‌డం కూడా అత్యంత దారుణం. ప్ర‌త్యర్థుల‌ను పులుల బోనుల్లో స‌జీవంగా వేసేయ‌డం.. కుక్క‌ల బోనుల్లోకి పంపించ‌డం.. వంటివి ఉత్త‌ర కొరియా స్ట‌యిల్‌.

By:  Tupaki Desk   |   23 Feb 2024 4:12 AM GMT
ఇలా కూడా చంపేస్తారా?  ర‌ష్యా ఘ‌ట‌న‌పై ప్ర‌పంచం విస్మ‌యం!
X

అధికారంలో ఉన్న‌వారు.. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల దాడి నుంచి త‌ప్పించుకునేందుకు.. వేధించేలా కేసులు పెడ‌తారు.. అరెస్టులు చేయిస్తారు.. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు తెలిసిన విష‌యం.. అయితే.. ఉత్త‌ర కొరియా వంటి నియంత దేశాల్లో మాత్రం నేరుగా వారిని చంపేసే ప‌రిస్థితి తెలిసిందే. అయితే.. ఆ చంప‌డం కూడా అత్యంత దారుణం. ప్ర‌త్యర్థుల‌ను పులుల బోనుల్లో స‌జీవంగా వేసేయ‌డం.. కుక్క‌ల బోనుల్లోకి పంపించ‌డం.. వంటివి ఉత్త‌ర కొరియా స్ట‌యిల్‌.

ఇక‌, ఇప్పుడు రష్యాలో వెలుగుచూసిన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు.. అలెక్సీ నావ‌ల్నీ.. మ‌ర‌ణం వెనుక‌.. మ‌రో వ్యూహం ఉంద‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. ``ఆయ‌నను అలానే చంపేశారు`` అంటూ స్థానిక‌మీడియా క‌థ‌నాలు వెల్లువెత్తాయి. దీంతో ఆ విష‌యం తెలిసి.. ప్ర‌పంచ దేశాలు విస్మ‌యం వ్య‌క్తం చేశాయి.

ఏం జ‌రిగింది?

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైల్లో మృతి చెందిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై భిన్న‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న‌ది సహజ మరణమని రష్యా ప్రభుత్వం చెబుతుండగా.. జైల్లో హింసించి చంపేశారని మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. నావల్నీని ‘వన్‌-పంచ్‌’ అనే స‌రికొత్త టెక్నిక్‌తో చంపేశార‌ని ఆయ‌న మ‌ద్ద‌తు దారులు చెబుతున్నారు. దీనినే స్థానిక ప‌త్రిక‌లు కూడా పేర్కొన్నాయి.

ఇది ఏంటి?

వ‌న్‌-పంచ్‌.. అంటే ఒకే గుద్దు(మ‌నోళ్లు అంటుంటారే.. ఒక్క గుద్దుకే చ‌చ్చిపోతావ్ అని! అలా.,.) రష్యా గూఢచార సంస్థ ‘కేజీబీ’.. ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు దీన్ని ఉపయోగిస్తుంది. నావల్నీని కూడా ఇదే టెక్నిక్‌తో హత్య చేసుంటారని మానవ హక్కుల కార్యకర్త వ్లాదిమిర్‌ ఒసెచ్కిన్‌ అనుమానం వ్యక్తం చేశారు. ``అవతలి వ్యక్తి ఛాతీపై గట్టిగా ఒకే ఒక్క గుద్దు గుద్ద‌డం ద్వారా గుండెపోటుకు గురై చనిపోయేలా చేయడమే దీని ప్రత్యేకత`` అని ఒసెచ్కిన్ చెప్పారు.

అంతేకాదు.. మ‌ర‌ణం సంభ‌వించిన స‌మ‌యంలో జైల్లో ఉండాల్సిన సీసీ కెమెరాలు ప‌నిచేయ‌లేద‌ని తెలిసింది. నావల్నీ మృతదేహాన్ని మార్చురీకి తరలించినప్పుడు ఆయన ఛాతీ, తలపై కమిలిన గాయాలు కనిపించినట్లు వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో తాజాగా వెలుగు చూసిన వ్య‌వ‌హారంపై ప్ర‌పంచ దేశాలు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నాయి.