Begin typing your search above and press return to search.

74 మంది సీఈవోల తొలగింపు.. ఎందుకంటే!

ఇవే కాకుండా అనేక కంపెనీలు ఇప్పటివరకు భారీగా ఉద్యోగుల్లో కోతలు వేయగా ఇప్పుడు ఉన్నతోద్యోగులపైనా దృష్టి సారించాయి.

By:  Tupaki Desk   |   16 Aug 2024 4:30 PM
74 మంది సీఈవోల తొలగింపు.. ఎందుకంటే!
X

కోవిడ్‌ అనంతర పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌ – హమాస్‌ పోరు, ఇప్పుడు ఇరాన్‌ – ఇజ్రాయెల్‌ మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం వైపు నడిపిస్తున్నాయనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ట్విట్టర్‌ (ఎక్స్‌), ఫేస్‌ బుక్‌ (మెటా), అమెజాన్, గూగుల్, ఇంటెల్‌ వంటి బడా కంపెనీలన్నీ 2022 చివరి నుంచే భారీగా ఉద్యోగులను తొలగిస్తూ వచ్చాయి. ఇవే కాకుండా అనేక కంపెనీలు ఇప్పటివరకు భారీగా ఉద్యోగుల్లో కోతలు వేయగా ఇప్పుడు ఉన్నతోద్యోగులపైనా దృష్టి సారించాయి. ఈ క్రమంలో గత 8 నెలల్లో దాదాపు 74 మంది సీఈఓలకు ఆయా కంపెనీలు గుడ్‌ బై చెప్పాయి. 74 మంది సీఈవోలను తొలగించాయి.

తాజాగా ప్రముఖ కాఫీ కంపెనీ స్టార్‌ బక్స్‌.. తమ సీఈవో లక్ష్మణ్‌ నరసింహను తొలగించింది. గత రెండు నెలలుగా కంపెనీ ఆదాయం కోల్పోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా ఆయన తొలగింపుకు కారణాలేమిటో స్టార్‌ బక్స్‌ వెల్లడించలేదు. అయితే కంపెనీ ఆదాయం అంతకంతకూ తగ్గిపోతుండటంతో ఆయనపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

స్టార్‌ బక్స్‌ కంపెనీ సీఈవో మాదిరిగానే ఇలా గత 8 నెలల్లో ఏకంగా 74 మంది సీఈవోలు తమ పదవులను పోగొట్టుకున్నారని చెబుతున్నారు. సీఈవోల రాజీనామాలు ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. ఆర్థిక మాంద్యం ముప్పు కొనసాగుతుండటంతో సీఈవోల రాజీనామాలు కూడా ఇంకా మున్ముందు కూడా కొనసాగుతాయని అంటున్నారు.

సీఈవోల తొలగింపులకు సంబంధించి ఎక్సే ్చంజ్‌.కామ్‌ వెబ్‌ సైట్‌ సంచలన విషయాలను వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 191 మంది సీఈవోలు రాజీనామాలు చేశారని తెలిపింది. ఇందులో 74 మందిని కంపెనీలు తొలగించాయని పేర్కొంది.

ఎక్సే ్చంజ్‌.కామ్‌ వెబ్‌ సైట్‌ ప్రకారం.. 2017లో 26 మంది, 2018లో 66 మంది, 2019లో 64 మంది, 2020లో 52 మంది, 2021లో 32 మంది, 2022లో 62 మంది, 2023లో 70 మంది, 2024లో ఈ ఎనిమిది నెలల్లో 74 మందిని కంపెనీలు బలవంతంగా సీఈవో పోస్టుల నుంచి తొలగించాయి.

ఆర్థిక మాంద్యం ప్రభావం, ఆయా కంపెనీల ఆదాయాలు పడిపోవడమే సీఈవోల తొలగింపునకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పడిప్పుడే అమెరికా ఆర్థిక పర్థితులు కుదురుకునే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఉద్యోగుల తీసివేతలు, సీఈవోల తొలగింపులు ఇంకా ఉంటాయని అంటున్నారు.