గన్నవరంలో వైసీపీ జెండా పీకేశారా? : పొలిటికల్ డిబేట్
అదేసమయంలో గన్నవరంలో వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని.. కొడాలి నాని కూడా ప్రకటించారు.
By: Tupaki Desk | 9 July 2024 2:30 AM GMTఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గన్నవరం. తాజా ఎన్నికలకు ముందు ఈ నియోజక వర్గం ఓ హాట్ టాపిక్. ఇక్కడ నుంచి బరిలో ఉన్న అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఓడించి తీరుతామ ని టీడీపీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక, టీడీపీని లేకుండా చేస్తానని వంశీ కూడా .. అదే రేంజ్ లో ప్రకటన చేశారు. అదేసమయంలో గన్నవరంలో వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని.. కొడాలి నాని కూడా ప్రకటించారు. అయితే.. తాజా ఎన్నికల్లో వంశీ పరాజయం పాలయ్యారు. ఇక, అప్పటి నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు.
ఈ విషయమే ఇప్పుడు నియోజకవర్గంలో చర్చకు వస్తోంది. వైసీపీ తరపున పోటీ చేసిన వల్లభనేని వంశీ గన్నవరం వదిలి వెళ్ళిపోయారా అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు కురుస్తున్నాయి. అంతేకాదు.. గన్నవరంలో అసలు వైసీపీ ఉందా? అనే చర్చ కూడా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు టీడీపీ తరపున చంద్రబాబు,లోకేష్ లు వచ్చి తనపై పోటీ చేయమని సవాల్ విసిరారంటూ వంశీపై వ్యంగ్యాస్త్రాలు కూడా పడుతున్నాయి. ఒడి పోయాక ఎక్కడకి వెళ్ళిపోయాడంటూ సోషల్ మీడియా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
కనీసం పార్టీ కార్యాలయం కూడా లేకుండా పోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరంలో వైసీ పీ కనుమరుగైందనే వాదన కూడా.. వినిపిస్తుండడం గమనార్హం. గన్నవరం లో వైసీపీ కార్యాలయం కూడా లేక పోవడం ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులకు కూడా అసహనం తెప్పిస్తోంది. ఎన్నికలు జరిగి నెల రోజు పూర్తయినా గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీ అడ్రస్ లేకపోవడాన్ని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. చిత్రం ఏంటంటే.. గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు కూడా నాయకులు కరువయ్యారు.