వీడియో... ఫంక్షన్ లో వివాదం... యువకుడిని టెర్రస్ పై నుంచి తోసేశారు!
ఈ సమయంలో గొడవ పడుతున్న యువకుల్లో ఒకడు తన తండ్రికి ఫోన్ చేయడంతో... ఆ గాలివాన కాస్తా ఉగ్రరూపానికి చేరింది.
By: Tupaki Desk | 22 April 2024 9:18 AM GMTఫ్రెండ్ ప్రీవెడ్డింగ్ ఫంక్షన్ లో సరదాగా గడుపుతున్న యువకుల మధ్య మొదలైన చిన్న గొడవ.. చినికి చినికి గాలివానగా మారింది. ఈ సమయంలో గొడవ పడుతున్న యువకుల్లో ఒకడు తన తండ్రికి ఫోన్ చేయడంతో... ఆ గాలివాన కాస్తా ఉగ్రరూపానికి చేరింది. ఈ సమయంలో తన కొడుకుతో గొడవపడుతున్న మరో యువకుడిని టెర్రస్ పై నుంచి తోసేశారు. దీంతో... వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకూ చేరింది.
అవును... ఫ్రెండ్ ప్రీవెడ్డింగ్ పార్టీలో సరదాగా గడుపుతున్న సమయంలో యువకుల మధ్య జరిగిన చిన్న వివాదం కాస్తా చినికి చినికి గాలివానగా మారి ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది. ఈ రచ్చ అంతా బరేలిలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిందని తెలుస్తుంది. ఈ సమయంలో ఒక యువకుడి తండ్రి మరో యువకుడిని ఏకంగా టెర్రస్ పై నుంచి కిందకు తోసేయడం సంచలనంగా మారింది.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం... బరేలీలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్ లో ఓ వ్యాపారవేత్త కుమారుడి ప్రీవెడ్డింగ్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరుడి స్నేహితులంతా సరదాగా గడుపుతున్నారు. ఈ సమయంలో... వరుడి స్నేహితుడు రిదిమ్ అరోరా, అదే హోటల్ కు వచ్చిన మరో యువకుడు సార్థక్ అగర్వాల్ కు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పరస్పరం దాడికి దిగారు.
దీంతో సరదాగా జరుగుతున్న ప్రీవెడ్డింగ్ ఫంక్షన్ కాస్తా రచ్చ రచ్చగా మారడం మొదలైంది. ఈ నేపథ్యంలో వరుడి స్నేహితుడు రిదిమ్ అరోరా.. తన తండ్రి సంజీవ్ అరోరాకు ఫోన్ చేసి సంఘటనా స్థలానికి పిలిచాడు. దీంతో అసలు రచ్చ మొదలైంది. కుమారుడి ఫోన్ కాల్ తో సంఘటనా స్థలానికి వచ్చిన సంజీవ్ అరోరా... ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయాడు! నియంత్రణ కోల్పోయాడు!
ఈ సమయంలో తన కుమారుడితో గొడవకు దిగిన సార్థక్ అగర్వాల్ పై దాడి చేశాడు. అక్కడితో ఆవేశం చల్లారలేదో ఏమో కానీ... అతడిని ఏకంగా హోటల్ టెర్రస్ పైనుంచి కిందకు తోసేశాడు. ఈ సమయంలో.. కింద పడిన సార్థక్ అగర్వాల్ తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తెల్లవారు జామున 2గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది!
ఈ రచ్చంతా ఈ స్థాయికి చేరడంతో నిందితులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు... గొడవ జరిగిన సమయంలో అంతా మద్యం మత్తులో ఉన్నారని పేర్కొన్నారు.