Begin typing your search above and press return to search.

నా క‌న్నా.. చంద్ర‌బాబు ఎక్కువ సొమ్ము ఇస్తామంటున్నారు: జ‌గ‌న్‌

తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్య‌క్ర‌మంలో సీఎం పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 1:53 PM GMT
నా క‌న్నా.. చంద్ర‌బాబు ఎక్కువ సొమ్ము ఇస్తామంటున్నారు:  జ‌గ‌న్‌
X
''నా క‌న్నా చంద్ర‌బాబు మీకు ఎక్కువ సొమ్ము ఇస్తామ‌ని చెబుతున్నారు. నేను కీల‌క‌మైన 8 ప‌థ‌కాల‌ను అమ‌లు చేసేందుకు ఏటా 52 వే ల‌కోట్లకు పైగానే ఖ‌ర్చు చేస్తున్నా. మ‌రి మాక‌న్నా ఎక్కువ‌గా ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని చెబుతున్న ఆ ప‌థ‌కాల కోసం ల‌క్ష కోట్ల రూపాయ‌లకు పైనే తీసుకురావాలి. మ‌రి అంత సొమ్ము ఎక్క‌డ నుంచి తెస్తారు? ఏ రూపంలో తీసుకువ‌స్తారు? ఆ విష‌యం కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి'' అని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్య‌క్ర‌మంలో సీఎం పాల్గొన్నారు.

గంజాయి-తుల‌సి!

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. ''చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క. మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క'' అని అన్నారు. అంతేకాదు.. ''గతంలో జన్మభూమి కమిటీల అరాచ కాల వల్ల జనం నష్టపోయారు. చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం. నా పాలనకు మీరంతా బ్రాండ్ అంబాసిడర్లు వాలంటీర్ల సేవలకు గర్విస్తూ సెల్యూట్ చేస్తున్నా. వాలంటీర్లు నా సైన్యం.. పేదలకు సేవ చేసే వాలంటీర్లే.. రేపు కాబోయే లీడర్లు'' అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు

పేదవాళ్లకు మంచి చేయాలన్న తపన చంద్రబాబుకు లేదని సీఎం జ‌గ‌న్ విమ‌ర్శించారు. గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారని అన్నారు. జన్మభూమి కమిటీ, సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందన్నారు. మన వ్యవస్థల ద్వారా ప్రతీ గ్రామంలో స్కూళ్లు, ఆసుపత్రులు మారాయ ని పేర్కొన్నారు. ‘‘ఇంటింటి ఆర్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని సురక్ష ప్రవేశపెట్టాం. గత ప్రభుత్వంలో ప్రతీ పథకానికి లంచం ఇవ్వాలిందే. గత ప్రతీ పనికి కార్యాలయా చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది'' అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

మేనిఫెస్టోల‌పై..

ప్రజల కష్టాల నుంచి వైసీపీ మేనిఫెస్టో పుట్టిందని సీఎం జ‌గ‌న్ అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్‌లో పుట్టిందని చెప్పారు. ''చంద్రబాబు వేరే రాష్ట్రాల్లోని హామీలను కిచిడీ చేసి మేనిఫెస్టో అంటాడు. బాబు హామీలకు రూ. లక్షా 26 వేల 140 కోట్లు అవుతుంది. ఎలాగో ఇచ్చేది లేదు కాబట్టి.. బాబు ఏదేదో చెప్తాడు. చంద్రబాబు కాలుకదపకుండా హైదరాబాద్ ఇంట్లో కూర్చుంటారు. వేరే రాష్ట్రాల్లో గెలిచిన పార్టీల హామీలు సేకరిస్తారు. ఆ హామీలన్నీ కిచిడీలు చేసి కొత్త మేనిఫెస్టో అంటారు. ఆ హామీలు అమలు చేసే పరిస్ధితి కూడా రాష్ట్రానికి ఉండదు'' అని సీఎం అన్నారు.