Begin typing your search above and press return to search.

ఆయన వద్దు అంటూ కూటమి...అయినా ?

చాలా కీలకమైన పోస్టులలో ఉన్న వారికి పూర్తిగా కదిపేయగలిగారు.

By:  Tupaki Desk   |   29 May 2024 3:17 PM GMT
ఆయన వద్దు అంటూ కూటమి...అయినా ?
X

ఏపీలో టీడీపీ కూటమికి బీజేపీ మిత్రుడుగా చేరాక దూకుడు వేరే లెవెల్ లో సాగింది. ఎవరిని బదిలీ చేయాలని కోరినా చకచకా అది జరిగిపోయింది. దాంతో టీడీపీ కూటమికి ఏపీలో నల్లేరు మీద నడకలా సీన్ మారింది అని అంటున్నారు. అదే టైం లో ఏకంగా డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని బదిలీ చేయించగలిగారు. చాలా కీలకమైన పోస్టులలో ఉన్న వారికి పూర్తిగా కదిపేయగలిగారు.

కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డిని మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఆయన ప్లేస్ లో కొత్తవారిని తీసుకుని రావాలని టీడీపీ కూటమి చేస్తున్న ప్రయత్నాలు అయితే పెద్దగా ఈ రోజు దాకా ఫలించిన దాఖలాలు లేవు.

అయితే ఇటీవల కొందరు నేతలు ఢిల్లీ వెళ్ళి కూడా అక్కడ బిగ్ షాట్స్ తో ఇదే విషయం చర్చించారని కానీ సీఎస్ లాంటి సీనియర్ ని పక్కన పెట్టాలీ అంటే తగిన బేస్ ఉండాలి కదా అన్న మాట కూడా ఆ బిగ్ షాట్స్ నుంచి వినిపించింది అని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ భూ కుంభకోణంలో జవహర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపిస్తూ ఇపుడు టీడీపీ జనసేనల నుంచి ఘాటు విమర్శలు వస్తున్నాయి.

ఇవన్నీ కూడా కౌంటింగ్ వేళ నాటికి సీఎస్ ని సీటు నుంచి తప్పించడం కోసమే అని కూడా అంటున్నారు. సీఎస్ ని ఎందుకు తప్పించాలి అంటే ఆయన ఆ సీటు లో ఉంటే కౌంటింగ్ వేళ ఇబ్బందులు ఎదురవుతాయని ఏదో డౌట్ అంటున్నారు. నిజానికి అలాంటివి ఏవీ ఉండవని కూడా అంటున్న వారు ఉన్నారు.

కానీ తన పంతం నెరవేర్చుకోవడానికి ఇదంతా అని అంటున్న వారూ ఉన్నారు. కానీ టీడీపీ కూటమి కోరిన హిరణ్యాక్ష వరాలకు ఓకే చెప్పిన బీజేపీ పెద్దలు ఆ ఒకే ఒక్కడు విషయంలో ఎందుకు తాత్సార వైఖరి ప్రదర్శిస్తున్నారు అంటే దాని వెనక కూడా రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తునాయి.

ఏపీలో ఎంత చూసుకున్నా సర్వేలు ఎన్ని చెప్పినా ఎవరు అధికారంలోకి వస్తారో తెలియడంలేదు అన్నది ఒక పాయింట్. ఒక వేళ కూటమి అధికారంలోకి వచ్చి మెజారిటీ ఎంపీ సీట్లు దక్కినా కూడా వైసీపీకి కూడా తొమ్మిదికి తక్కువ కాకుండా ఎంపీ సీట్లు వస్తాయని మరో మాట కూడా ఉంది.

బీజేపీకి అయితే ఏకంగా పాతిక ఎంపీ సీట్లూ ఏపీ నుంచి కావాలని అంటున్నారు. అందుకే పోలింగ్ ముందు ఎంత దూకుడుగా కూటమికి సహకారం ఢిల్లీ నుంచి అందినా ఆ తరువాత మాత్రం ఫ్యూచర్ ప్లాన్స్ లో భాగంగానే ఆచీ తూచీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఏమో రేపటి రోజున అవసరాలు రెండు వైపుల నుంచి ఉండవచ్చు. అందుకే ఎందుకు ఒకరితోనే ఉంటూ రెండవ వైపు వారిని దూరం చేసుకోవడం అన్న ముందస్తు వ్యూహాలలో భాగంగానే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఒకే ఒక్కడుగా ఆయన మిగిలిపోతున్నారు. కూటమికి ఎటూ మింగుడు పడకుండా ఈ వ్యవహారం ఉంది అని అంటున్నారు.