Begin typing your search above and press return to search.

అమెరికాలోని గుడిలో దొంగలు పడ్డారు.. హిందూ సమాఖ్య సీరియస్!

ఈ ఫుటేజీలో వారు దాదాపు 100 పౌండ్ల బరువున్న పెట్టెను ఆలయ భవనం వెనుకకు తీసుకొని కారులో తరలించినట్లు ఉందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   1 Nov 2023 4:03 AM GMT
అమెరికాలోని గుడిలో దొంగలు పడ్డారు.. హిందూ సమాఖ్య సీరియస్!
X

అగ్రరాజ్యం అమెరికాలోని హిందూ దేవాలయంలో దొంగలు పడ్డారు. కాలిఫోర్నియా రాష్ట్రం లోని గుడిలో హుండీపై కన్నేసిన దొంగలు అనుకున్న పనిచేశారు. అయితే ఈ దోపిడీలో ఎంతమంది దుండగులు పాల్గొన్నారనే విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలుస్తుంది. స్థానికంగా ఈ విషయం కలకలం రేపింది. హిందూ సమాఖ్య ఈ విషయాన్ని ఖండించింది.

అవును... అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో నగరంలోని పార్క్‌ వే ప్రాంతంలో ఉన్న ఓం రాధా కృష్ణా మందిరంలోని హుండీ చోరీకి గురైంది. సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగినట్లు సమాచారం అందడంతో శాక్రమెంటో పోలీస్ అధికారులు హరి ఓం రాధా కృష్ణ మందిర్‌ కు తెల్లవారుజామున 2:15 గంటలకు చేరుకున్నారు.

ఈ సమయంలో ఇద్దరు దొంగలు గుడిలోకి వద్దకు పరుగెత్తడం, విరాళం పెట్టె వద్దకు వెళ్లడం సీసీ కెమెరాల్లో కనిపించిందని సీబీఎస్ న్యూస్ నివేదించింది. ఈ ఫుటేజీలో వారు దాదాపు 100 పౌండ్ల బరువున్న పెట్టెను ఆలయ భవనం వెనుకకు తీసుకొని కారులో తరలించినట్లు ఉందని అంటున్నారు. ఆ పెట్టెలో వేల డాలర్లు ఉన్నాయని గురు మహరాజ్ సీబీఎస్ న్యూస్‌ కి తెలిపారు.

ఈ దొంగతనం ఎవరు చేసినా.. అది పక్కా ప్లాన్ తోనే చేశారని మహరాజ్ అభిప్రాయపడుతున్నారు. ఇది హిందూ కమ్యూనిటీకి చాలా పెద్ద దెబ్బ అని, తాము ప్రజలకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నామని ఆయన తెలిపారు. త్వరలో ఇక్కడున్న స్థలంలో 40 గదులతో ఆశ్రమం వంటిది నిర్మించబోతున్నామని అన్నారు! ఈలోపే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఇందులో భాగంగా.. ఇప్పటివరకు ఎటువంటి అరెస్టులు జరగలేదని, ఈ విషయంలో ఎవరివద్దైనా ఏమైనా సమాచారం ఉన్నా, మరెవరిపై అయినా అనుమానం ఉన్నా ఆ సమాచారాన్ని శాక్రమెంటో పోలీస్ డిపార్ట్మెంట్ కు కాల్ చేసి సహకరించవచ్చని సూచించారు.

ఈ ఘటనపై ఆన్ లైన్ వేదికగా స్పందించింది న్యాయవాద సంస్థ కోయలిషన్ ఆఫ్ హిందుస్ ఆఫ్ నార్త్ అమెరికా. ఇందులో భాగంగా... "ఈ సమస్యను చాలా సీరియస్‌ గా పరిగణించి.. దీనిని ద్వేషపూరిత నేరంగా, పవిత్రస్థలం ఉల్లంఘనగా పరిశోధించాలని.. ట్విట్టర్ వేదికగ శాక్రమెంటో పోలీస్ డిపార్ మెంట్ ను కోరింది.

కాగా... అమెరికాలోని హిందూ దేవాలయాల్లో దొంగతనాలు జరగడం ఇదే మొదటిసారి కాదనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ ఏడాది జనవరిలో టెక్సాస్‌ లోని బ్రజోస్ వ్యాలీలో ఉన్న శ్రీ ఓంకార్‌ నాథ్ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగలు విరాళాల పెట్టెను అపహరించారు. ఈ క్రమంలోనే తాజాగా శాక్రమెంటో నగరంలోని ఓం రాధా కృష్ణా మందిరంలోని హుండీని ఎత్తుకెళ్లారు.