బ్రేకింగ్... ప్రధాని నరేంద్ర మోడీని బెదిరిస్తూ ఫోన్ కాల్!
మహరాష్ట్ర ఎన్సీపీ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య అనంతరం బెదిరింపు కాల్స్ పెరిగిపోతున్నాయనే చర్చ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 28 Nov 2024 9:41 AM GMTమహరాష్ట్ర ఎన్సీపీ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య అనంతరం బెదిరింపు కాల్స్ పెరిగిపోతున్నాయనే చర్చ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఢిల్లీ, ముంబై తో పాటు పలు ప్రాంతాల్లోని బడా బడా వ్యాపారులకు ఫోన్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నారని అంటున్నారు.
దీంతో మరోసారి ముంబై అండర్ వరల్డ్ డాన్స్ చేతుల్లోకి వెళ్తోందా అనే చర్చ మొదలైంది! ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అమెరికాలో అరెస్ట్ అయినట్లు కథనాలొస్తున్నాయి. త్వరలో అతడిని భారత్ కు రప్పించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ప్రధాని మోడీపై బెదిరింపులకు పాల్పడ్డారు.
అవును... ఇటీవల ప్రముఖులకు, ధనవంతులకు బెదిరింపు కాల్స్ పెరిగిపోతున్నాయనే చర్చ పెరుగుతున్నాయనే విషయాలు తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మరో కాల్ వచ్చింది. అయితే ఇది వ్యాపారవేత్తనో, సినిమా సెలబ్రెటీనో బెదిరిస్తూ వచ్చిన కాల్ కాదు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని బెదిరిస్తూ వచ్చిన ఫోన్ కాల్!
రెగ్యులర్ గానే ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి గురువారం ఉదయం కూడా ఓ ఫోన్ కాల్ వచ్చింది! అయితే... ఇది బెదిరింపు కాల్ కాగా... అందులో మాట్లాడిన ఓ మహిళ.. ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు బెదిరించారు. దానికోసం ఓ ఆయుధాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు ఆమె చెప్పారు.
దీంతో... పోలీసు అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ ఫోన్ కాల్ ను ట్రేస్ చేయడం మొదలుపెట్టారని తెలుస్తోంది. అయితే.. సదరు మహిళ మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ఏపట్టినట్లు వెల్లడించారు.