Begin typing your search above and press return to search.

మాజీ ప్రియురాలి పై పైశాచికం.. స్నేహితులకు అప్పగించి..!

వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలు పంపించి బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఆమె పై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

By:  Tupaki Desk   |   2 Aug 2023 4:30 PM GMT
మాజీ  ప్రియురాలి పై  పైశాచికం.. స్నేహితులకు అప్పగించి..!
X

ప్రేమపేరుతో దగ్గరవ్వడం.. అనంతరం సన్నిహితంగా ఉండటం.. ఆ సన్నివేశాలు చిత్రీకరించడం.. అనంతరం బ్లాక్ మెయిల్ కి పాల్పడటం.. ఈ మధ్య తరచూ వెలుగు లోకి వస్తోన్న చీకటి సంఘటనలు ఇవి. ఇలాంటి ఎన్నో సంఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నా.. బలైపోయేవారు బలైపోతూనే ఉన్నారు!

ఈ క్రమంలో తాజాగా ఒక యువతి అత్యంత దారుణంగా బలైపోయింది. మాజీ ప్రియుడి పిచ్చి చేష్టల కు, పైశాచిక మనస్తత్వానికి జీవితాన్ని నాశనం చేసుకున్నంత పని చేసింది. ఆఖరికి భరించలేకపోయింది. ఫైనల్ గా పోలీసుల ను ఆశ్రయించింది. ప్రస్తుతం పోలీసులు వారి పని వారు చేస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరు కు చెందిన ఒక వ్యక్తి (28) ఒక ప్రైవేటు పాఠశాల లో డ్యాన్స్ టీచర్ గా పనిచేస్తున్నాడు. ఈ సమయం లో ఈశాన్య రాష్ట్రాల కు చెందిన ఒక యువతి (23) రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో రెగ్యులర్ గా కలుసుకుంటూ ఉండేవారు.

ఈ సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరగడంతో మరింత సన్నిహితంగా కలవడం మొదలుపెట్టారు. ఇలా సాగుతున్న క్రమంలో అతడి ప్రవర్తన నచ్చక దూరం పెట్టేసింది ఆ యువతి. అక్కడి నుంచి ఇతడి అసలు స్వరూపం బయటపడిందని తెలుస్తుంది.

అలా యువతి దూరం పెట్టినప్పటినుంచీ ఫోన్ లో టచ్ లోకి వెళ్తోన్న ఈ వ్యక్తి... వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలు పంపించి బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఆమె పై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతడి పైశాచికత్వం మరింతగా రెక్కలు విప్పుకుంది.

అవును... సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలు చూపించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఈ వ్యక్తి... కొంతకాలం తర్వాత తన స్నేహితులతో సన్నిహితంగా ఉండాల ని కోరడం మొదలుపెట్టాడు. అందుకు ఆ యువతి తొలుత నికారించిందట. అయినా సరే మరోసారి బ్లాక్ మెయిల్ కి దిగి ఒప్పించాడంట.

ఇలా తన స్నేహితుల దగ్గరకు కూడా ఈమెను బలవంతంగా పంపడం స్టార్ట్ చేశాడు. ఈ సమయంలో స్నేహితుల నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు. ఇలా సాగుతున్న క్రమంలో కొన్ని రోజుల తర్వాత తన మాజీ ప్రియిడితోపాటు... అతడి స్నేహితులిద్దరినీ కూడా కలవడం మానేసింది ఈ యువతి.

దీంతో మరోసారి ఆమె వీడియోలు, ఫోటోలు చేస్తానని బెదిరించడంతో పాటు.. తన స్నేహితుల కు షేర్ చేశాడు ఆ వ్యక్తి. దీంతో వారి వేధింపులు తాళలేక విసిగిపోయిన ఆ యువతి పోలీసుల కు ఫిర్యాదు చేసింది. దీంతో... కేసు నమోదు చేసిన పోలీసులు ఈమె మాజీ ప్రియుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి ల్యాప్‌ టాప్‌, ఫోన్‌ ను స్వాధీనం చేసుకున్నారు.