హీరోయిన్లను బెదిరించానంటున్నారు... కేటీఆర్ రియాక్షన్ వైరల్!
ఇదే క్రమంలో హీరోయిన్ల ప్రస్థావన తెచ్చిన కేటీఆర్... "ఎవరో హీరోయిన్లను బెదిరించానని ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ వ్యవహారానికీ నాకూ ఎటువంటి సంబంధం లేదు.
By: Tupaki Desk | 3 April 2024 7:59 AM GMTతెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పలు కీలక విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇందులో భాగంగా... బీఆరెస్స్ నేతలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష ఒకటి కాగా.. తెలంగాణలో కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందనే చర్చ రెండోదిగా ఉందని తెలుస్తుంది! ఈ సమయంలో ఫోన్ ట్యాపింగ్ అంశం మరింత వైరల్ గా మారుతుంది. ఈ సమయంలో హీరోయిన్లు - ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
అవును... ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశం ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా ప్రధానంగా కాంగ్రెస్ - బీఆరెస్స్ నేతల మధ్య మాటల యుద్ధాలు పీక్స్ కి చేరుకుంటున్నాయి. ఈ సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ రచ్చను మరో లెవెల్ కి తీసుకెళ్లిందనే కామెంట్లను సొంతం చేసుకుంటున్నాయి!
తాజాగా ఈ విషయాలపై స్పందించిన కేటీఆర్... ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు ఎలాంటి ఇల్లీగల్ విషయాలతోనూ సంబంధం లేదని పేర్కొన్నారు. ఇదే సమయంలో... ఏదైనా ఉంటే లీగల్ గా పోరాడతామని ఆయన తెలిపారు. ఇదే క్రమంలో... 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంటున్నారని.. దీనిపై కూడా రేవంత్ విచారణ జరిపించాలని అన్నారు.
ఇదే క్రమంలో హీరోయిన్ల ప్రస్థావన తెచ్చిన కేటీఆర్... "ఎవరో హీరోయిన్లను బెదిరించానని ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ వ్యవహారానికీ నాకూ ఎటువంటి సంబంధం లేదు. ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టము. తాట తీస్తాం.. నేను భయపడను" అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదే సమయంలో పార్టీలో గేట్లు ఎత్తడం కాదు, ప్రాజెక్టు గేట్లు ఎత్తండి.. ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాప్ లపై దృష్టి పెట్టండి అని హితవూ పలికారు!
ఇదే సమయంలో... తెలంగాణలో ప్రస్తుత కరువు ప్రకృతి ద్వారా వచ్చింది కాదని.. ఇది కాంగ్రెస్ పార్టీ సృష్టించిన కృత్రిమ కొరత అని కేటీఆర్ విమర్శించారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా ఉపయోగించుకునే తెలివి లేదని.. రాజకీయాలు తప్ప ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 218 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని.. ఆ వివరాలన్నీ రేవంత్ రెడ్డికి పంపిస్తామని తెలిపారు.