Begin typing your search above and press return to search.

అరుదైన మూడు తరాల నేతలు వీరే!

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, పార్లమెంటుకు మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి లె లిసిందే.

By:  Tupaki Desk   |   25 April 2024 10:30 AM GMT
అరుదైన మూడు తరాల నేతలు వీరే!
X

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, పార్లమెంటుకు మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి లె లిసిందే. ఏప్రిల్‌ 25తో నామినేషన్ల పర్వం ముగియనుంది. దీంతో అభ్యర్థులంతా ఉధృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర అంశాలు తెరమీద కొస్తున్నాయి.

సినిమాలు, వ్యాపారం, క్రీడా రంగాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ వారసుల ఎంట్రీ సర్వసాధారణం. అయితే తరాల తరబడి రాజకీయాల్లో కొనసాగుతున్నవారు అరుదే. ఇప్పుడు ఇలాంటి అరుదైన ఘట్టం ఏపీ రాజకీయాల్లో ఆవిష్కృతమైంది.

తాత, తండ్రి, మనుమడు ఇలా మూడు తరాల వారు ఎమ్మెల్యేలుగా పనిచేసిన రికార్డును కొందరు నేతలు చేజిక్కించుకున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే, ప్రస్తుతం ఏపీ ఐటీ, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ మంత్రి గుడివాడ అమర్‌ నాథ్‌ ఇలాంటి వారిలో ఒకరు. అమర్‌నాథ్‌ తండ్రి గుడివాడ గుర్నాథరావు 1989లో పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతకుముందు గుర్నాథరావు తండ్రి గుడివాడ అప్పన్న కూడా 1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించడం విశేషం.

ఇక గుడివాడ అమర్‌ నాథ్‌ తొలిసారి అనకాపల్లి ఎమ్మెల్యేగా 2019లో పోటీ చేసి గెలుపొంందారు. వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ లో మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అమర్‌ నాథ్‌ గాజువాక నుంచి బరిలో ఉన్నారు.

అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా 1955లో పర్వత గుర్రాజు ఎన్నికయ్యారు. ఇక 1994లో ఆయన కుమారుడు పర్వత సుబ్బారావు, 1999లో గుర్రాజు కోడలు బాపనమ్మ, 2009లో గుర్రాజు మనుమడు సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యేలుగా విజయం సాధించడం విశేషం.

అలాగే మరో నేత కూడా ఈ అరుదైన రికార్డు ముంగిట నిలిచారు. మచిలీపట్నం ఎమ్మెల్యేగా ప్రస్తుతం పేర్ని నాని ఉన్నారు. ఆయన 2004, 2009, 2019ల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి 1989లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తాజా ఎన్నికల్లో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు బరిలో దిగుతున్నారు. ఆయన విజయం సాధిస్తే తాత, తండ్రి, మనుమడు.. ఇలా మూడు తరాల వ్యక్తులు ఎమ్మెల్యేలయిన రికార్డు దక్కించుకుంటారు.