Begin typing your search above and press return to search.

దేశంపై పడ్డ ఆ మూడు గ్రామాలు... పోలీసుల షాకింగ్ వివరాలు!

మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లా గల గుల్ఖేడీ, సాంసీ, హుల్ఖేడీ గ్రామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   26 Aug 2024 6:41 AM GMT
దేశంపై పడ్డ ఆ మూడు గ్రామాలు... పోలీసుల షాకింగ్  వివరాలు!
X

మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లా గల గుల్ఖేడీ, సాంసీ, హుల్ఖేడీ గ్రామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. దేశంలో ఎక్కడ కాస్త భారీ దొంగతనం జరిగినా పోలీసులు అటువైపు కూడా చూస్తున్నారని అంటున్నారు! ఇప్పటికే ఇక్కడ పేరెంట్స్ నుంచి 2 - 3 లక్షలు ఫీజు కట్టించుకుని మరీ వారి పిల్లలను తయారుచేస్తున్నారని.. అనంతరం ఏడాదికి ఆ పేరెంట్స్ కు 5 లక్షల వరకూ రిటన్స్ ఇస్తున్నారని కథనాలొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ మూడు గ్రామాలపైన పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని అంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎంపీ నుంచి బయలుదేరిన మందల మంది ట్రైన్డ్ దోపిడీ దారులు.. దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించారని.. అత్యంత వ్యూహాత్మకంగా, మరింత చాకచక్యంగా సీసీ కెమెరాలకు తప్ప మూడో కంటికి తెలియకుండా పని పూర్తి చేసి పరారవుతున్నారని అంటున్నారు.

అవును... రాజ్ గఢ్ జిల్లా గల గుల్ఖేడీ, సాంసీ, హుల్ఖేడీ గ్రామాలకు చెందిన కొంతమంది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చోరీలకు, నేరాలకు పాల్పడుతూ భారీ స్థాయిలో సొమ్ములు ఆర్జిస్తున్నారు. ఇటీవల జైపూర్ లో జరిగిన పెళ్లి కార్యక్రమంలో దొంగతనం జరగడంతో ఈ గ్రామస్థుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.

తెలంగాణకు చెందిన ఓ వ్యాపారి కుమారుడి వివాహం ఆగస్టు 8న అక్కడి ఫైవ్ స్టార్ హోటల్ లో నిర్వహించారు. ఈ క్రమంలోనే రూ.1.45 కోట్ల విలువ చేసే ఆభరణాలున్న బ్యాగ్ ను 14ఏళ్ల బాలుడు చోరీచేశాడు. దీంతో... విషయం తెలుసుకున్న పోలీసులు 24 గంటల్లొనే నిందితున్ని అరెస్ట్ చేశారు. అనంతరం చోరీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే పైన చెప్పుకున్న మూడు గ్రామాల వ్యవహారాన్ని వెల్లడించారు పోలీసులు. ఇందులో భాగంగా ఈ మూడు గ్రామాలకు చెందిన 13-14 ఏళ బాల బాలికలు, పురుషులు, స్త్రీలపై సుమారు 1000 నుంచి 2000 వరకూ క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ మూడు గ్రామాల్లోనూ ప్రధానంగా సాంసీ నేరస్థులకు ప్రధాన స్థావరంగా ఉంటోందని పోలీసులు వెల్లడించారు.

గత ఆరు నెలల్లోనే పోలీసులు ఈ ముఠాలకు చెందిన 25 మందిని అరెస్ట్ చేయగా వారి నుంచి రూ.4.37 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకొవడం గమనార్హం. ఇక ఈ గ్రామాలపైకి ఎవరైనా పోలీసులు ఎంక్వైరీ కోసమో, నిందితులను అరెస్ట్ చేయడం కోసమో వెళ్తే.. గ్రామస్థులు తిరగబడుతున్నారంట. ఇటీవల కోయంబత్తూరు నుంచి వచ్చిన పోలీసు టీమ్ పై గ్రామస్థులు రాళ్లదాడికి పాల్పడి తరిమికొట్టారు. అచ్చం 'ఖాకీ' సినిమాలో సన్నివేశాల్లా!!

అయితే ఈ ఆరోపణలపై స్పందించిన సాంసీ గ్రామ సర్పంచ్... వీటిని ఖండిస్తున్నారు. తమ పూరి ప్రజలు సిటీల్లో ఉద్యోగాలు చేస్తున్నారని.. అందరూ బాగా చదువుకున్నవారే ఉన్నారని.. ఈ తరం పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారని అన్నారు. అయితే.. ఎవరో కొంతమంది మాత్రమే ఇలాంటి పనులకు పాల్పడుతుండొచ్చని చెప్పుకొచ్చారు.