Begin typing your search above and press return to search.

రైతుబంధు : తుమ్మల కలకలం

ఈ సమావేశంలో పక్కనే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉండడం గమనార్హం.

By:  Tupaki Desk   |   30 April 2024 11:17 AM GMT
రైతుబంధు : తుమ్మల కలకలం
X

‘’నాకే ఇంకా రైతు బంధు రాలేదు.. ఎందయ్యా అని ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అడిగితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాక రైతుబంధు ఇస్తాను అన్నాడు’’ అని ఒక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్న వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ సమావేశంలో పక్కనే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉండడం గమనార్హం.

రుణమాఫీ విషయంలో ఇప్పటికే తెలంగాణలో రచ్చ నడుస్తుండగా, రైతుబంధు విషయంలో తుమ్మల వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. తుమ్మల వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం గమనార్హం.

‘’రైతుబంధు ఇవ్వ‌కుండా తెలంగాణ రైతుల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ద్రోహం చేసింద‌ని, రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు వ్యాఖ్య‌ల‌తో స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని’’ కేసీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా రుణమాఫీ, రైతుబంధు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఇప్పుడు రాష్ట్ర మంత్రి స్థానంలో ఉన్న తుమ్మల ఈ వ్యాఖ్యలు చేయడం మరోసారి చర్చకు దారితీసింది.