Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే గొప్ప ప్రదేశాలు.. భారత్ లో ఈ రెండు హోటళ్లు!

ఇదే సమయంలో ఒక రెస్టారెంట్ కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది. ఇందులో భాగంగా... ముంబైలోని పాపాస్ రెస్టారెంట్ సందర్శించాల్సిన ప్రదేశాల జాబితాలో ఒకటిగా పేరుపొందింది.

By:  Tupaki Desk   |   15 March 2025 7:00 AM IST
ప్రపంచంలోనే గొప్ప ప్రదేశాలు.. భారత్  లో ఈ రెండు హోటళ్లు!
X

టైమ్ మ్యాగజైన్ తన 2025 ప్రపంచ గొప్ప ప్రదేశాల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుత ప్రదేశాలు, అనుభవాలను హైలైట్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఎంట్రీల్లో ప్రధానంగా హోటళ్లు, క్రూయిజ్ లు, మ్యూజియంలు, పార్కులు మొదలైనవి ఉన్నాయి! ఈ సమయంలో భారత్ లోని రెండు హోటళ్లు ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి.

అవును... టైమ్ మ్యాగజైన్ 'ప్రపంచ గొప్ప ప్రదేశాల జాబితా - 2025' జాబితాను ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో భారత్ నుంచి రెండు హోటళ్లు స్థానం దక్కించుకున్నాయి. ఇందులో భాగంగా... జైపూర్ రాఫిల్స్, బాంధవ్ గడ్ లోని ఒబెరాయ్ వింధ్యవిలాస్ వైల్డ్ లైఫ్ రిసార్ట్ లు బస చేయడానికి అనువైన స్థలాల విభాగంలో చోటు దక్కించుకున్నాయి.

ఇదే సమయంలో ఒక రెస్టారెంట్ కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది. ఇందులో భాగంగా... ముంబైలోని పాపాస్ రెస్టారెంట్ సందర్శించాల్సిన ప్రదేశాల జాబితాలో ఒకటిగా పేరుపొందింది.

ఇక.. రాఫెల్స్ అనేది జైపూర్ సమీపంలోని కుకాస్ పట్టణంలో ఉన్న ఒక రాజభవన హోటల్. రాణి ప్యాలెస్ నుంచి ప్రేరణ పొందిన ఈ 50 గదుల హోటల్ లో పాలరాయి శిల్పాలు, మొఘల్ శైలి తోరణాలు, జాలిస్ అని పిలువబడే చిల్లులు గల లాటిస్ వర్క్ స్క్రీన్ లు, ప్రత్యేకమైన సంప్రదాయ అద్దాలు, మొజాయిక్ ఫ్లోర్ తో కూడిన దీని డిజైన్ ఓ కళాఖండం అని చెబుతారు.

ఇందులో ఆరావళి పర్వతాలను చూసే రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్, స్పా, నాలుగు డైనింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. ఈ రాజభవన హోటల్ లో అడుగూడుగునా అప్ డేటెడ్ రాజ కళ కనిపిస్తుందని చెబుతారు.

ఇదే సమయంలో... మధ్యప్రదేశ్ లోని ప్రసిద్ధ బంధవ్ గఢ్ నేషనల్ పార్క్ సమీపంలో ఉంది 21 ఎకరాల ఒబెరాయ్ వింధ్యవిలాస్ వైల్డ్ లైఫ్ రిసార్ట్. ఈ రిజర్వ్ దాని సఫారీలకు ప్రసిద్ధి చెందింది. ఈ సఫారీ ద్వారా రాయల్ బెంగాల్ టైగర్ లను వాటి సహజ ఆవాసాలలో చూడవచ్చు. ఈ హోటల్ అతిథులకు వివిధ వన్యప్రాణులకు సంబంధించిన అనుభవాలను అందిస్తుంది.

ఈ రిసార్ట్ 19 విశాలమైన ఎయిర్ కండిషన్డ్ టెంట్లతో రూపొందించబడింది. ఇందులో ప్రతీ దానికి సొంత గార్డెన్, రెండు ప్రైవేట్ పూల్ విల్లాలు ఉన్నాయి. వీటితో పాటు స్పా, లైబ్రరీ, స్విమ్మింగ్ ఫూల్, ఫిట్ నెస్ సెంటర్, పచ్చని తోట స్థలాలతో పాటు స్థానికంగా లభించే పదార్థాలతో తయారుచేసిన భోజనాన్ని అందించే ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్ ఉన్నాయి!