టైమ్స్ నౌ సర్వే : ఏపీలో అధికారం ఆ పార్టీదేనట...!
లేటెస్ట్ గా చూస్తే టైమ్స్ నౌ సంస్థ జరిపిన సర్వే ఏపీలో వైసీపీకే తిరిగి అధికారం దక్కుతుందని చెబుతోంది.
By: Tupaki Desk | 17 April 2024 3:49 AM GMTఏపీలో అధికారం ఎవరిది అన్న దాని మీద లోకల్ రీజనల్ నేషనల్ సర్వేలు తమదైన సర్వేలను వెల్లడిస్తున్నాయి. లేటెస్ట్ గా చూస్తే టైమ్స్ నౌ సంస్థ జరిపిన సర్వే ఏపీలో వైసీపీకే తిరిగి అధికారం దక్కుతుందని చెబుతోంది. ఆ సంస్థ సర్వే ఫలితాలను విడుదల చేసింది.
దాని ప్రకారం చూస్తే ఏపీలో మొత్తం పాతిక ఎంపీ సీట్లలో వైసీపీ 19 నుంచి 20 దాకా గెలుచుకుంటుందని వెల్లడించింది. ఇక టీడీపీకి 3 నుంచి 4 ఎంపీ సీట్లు అలాగే బీజేపీకి 1 ఎంపీ సీటు దక్కవచ్చు అని పేర్కొంది. రెండు ఎంపీ సీట్లకు పోటీ చేస్తున్న జనసేనకు ఒక్క ఎంపీ కూడా రాదని తేల్చేసింది ఈ సర్వే.
ఈ సర్వే ప్రకారం చూస్తే కనుక ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చింది. ఈ ఎంపీ సీట్లను కనుక అసెంబ్లీ సీట్లకు కన్వర్ట్ చేసుకుంటే వైసీపీకి 140 అసెంబ్లీ సీట్లకు తక్కువ లేకుండా దక్కుతాని లెక్క తేలింది. అదే టీడీపీకి 21 నుంచి 28 సీట్ల దాకా రావచ్చు అన్నది ఈ సర్వే చెబుతోంది. ఇక బీజేపీ జనసేనలకు ఆ మిగిలిన సీట్లు రావచ్చు అని కూడా పేర్కొంటోంది.
ఈ సర్వే ప్రకారం వైసీపీ ప్రభంజనం ఏపీలో ఖాయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇక 2019లో చూస్తే వైసీపీకి 22 ఎంపీ సీట్లు దక్కాయి. ఈసారి ఆ సీట్లలో రెండు ఎంపీ సీట్లు కోత పడతాయని కూడా దీనిని బట్టి తెలుస్తోంది. అలాగే టీడీపీకి మూడు నుంచి నాలుగు ఎంపీ సీట్లు అంటే అదనంగా మరో ఎంపీ సీటు పెరిగినట్లే అంటున్నారు. బీజేపీకి ఎంపీ సీటు దక్కడం అంటే కొత్తగా ఆ పార్టీకి ఏపీలో ఉనికి దక్కినట్లే అంటున్నారు. చూడాలి మరి ఈ సర్వే ఫలితాలు ఎలా రిఫ్లెక్ట్ అవుతాయో.