మరో దారుణం... తిరుపతిలో 8ఏళ్ల బాలికపై అఘాయిత్యం!
గత కొన్ని రోజులుగా ఏపీలో బాలికలపై అఘాయిత్యలు వరుసగా జరుగుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 18 July 2024 7:10 AM GMTగత కొన్ని రోజులుగా ఏపీలో బాలికలపై అఘాయిత్యలు వరుసగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నంద్యాలలో 8 ఏళ్ల బాలికపై హత్యాచారం ఘటన తర్వాత బాధితురాలి మృతదేహం ఇంకా దొరకని పరిస్థితి. విజయనగరం, గుంటూరు జిల్లాల్లోనూ బాలికలపై దారుణాలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తిరుపతిలో మరో దారుణం చోటు చేసుకుంది.
అవును... నంద్యాల, విజయనగరం, గుంటూరు అనంతరం తాజాగా తిరుపతిలో ఓ బాలిక మరో కామాందుడికి బలైపోయింది. బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్ల బాలికను తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యం చేసి, హతమార్చాడు ఓ మృగాడు! ఈ దారుణం తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో బుధవారం జరిగింది. ఆ సమయంలో నిందితుడు గంజాయి సేవించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు!
వివరాళ్లోకి వెళ్తే... తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని ఓ గ్రామ రైస్ మిల్లులో బీహార్ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నాయి. అందులో పనిచేస్తున్న ఓ దంపతుల రెండో కుమార్తె ను అదే మిల్లులో పనిచేస్తున్న దిలీప్ (20) బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లాడు!
ఈ నేపథ్యంలో... మధ్యాహ్నం మిల్లు నుంచి వచ్చిన ఆ చిన్నారి పేరెంట్స్.. ఆమె కనిపించకపోయేసరికి ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల అంతా వైకారు. ఈ క్రమంలో... సాయంత్రం నాలుగు గంటల ప్రంతంలో మిల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకల కాపరులు బాలిక మృతదేహాన్ని చూశారు. వెంటనే స్థానికలకు, పోలీసులకూ సమాచారం అందించారు.
దీంతో పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సమయంలో బాలిక నోటితో పాటు పలు శరీర భాగాల్లో గాయాలు అయినట్లు గమనించారని అంటున్నారు. దీంతో... నిందితుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు!
అయితే దిలీప్ ఆ బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్ లో గుర్తించారని అంటున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బాలికకు బిస్కెట్లు కొనిచ్చేందుకు తీసుకెళ్లానని, ఆ తర్వాత ఏమి జరిగిందో తనకు తెలియదని పోలీసులకు చెప్పినట్లు చెబుతున్నారు. దీంతో... గంజాయి మత్తులో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమనిస్తున్నారు.