తిరువూరు ఇవ్వండి గెలిచి చూపిస్తాం.. దరఖాస్తులు...!
ఎన్టీఆర్ జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం తిరువూరు అభ్యర్థుల విషయం తెలుగు దేశం పార్టీకి సంకటంగా మారింది
By: Tupaki Desk | 29 Jan 2024 2:30 PM GMTఎన్టీఆర్ జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం తిరువూరు అభ్యర్థుల విషయం తెలుగు దేశం పార్టీకి సంకటంగా మారింది. ఇక్కడ ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంపై పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినా.. తర్వాత.. జరుగుతున్న పరిణామాలు. పోటెత్తుతున్న నాయకులను చూశాక..ఏం చేయాలా? అని పార్టీ తర్జన భర్జన పడుతోంది. వాస్తవానికి ఇప్పటికే ఒక ఇంచార్జిని పార్టీ నియమించింది. దేవదత్‌ను ఇక్కడ పార్టీకి సమన్వయకర్తను చేసింది.
దీంతో ఒక సమస్య తీరిందని పార్టీ నాయకులు హ్యాపీ ఫీలయ్యారు. కానీ, తర్వాతే అసలు సమస్య తెరమీ దికి వచ్చింది. శ్యావల దేవదత్‌కు వ్యతిరేకంగా అంతర్గత కుమ్ములాటలు తెరమీదికి వచ్చాయి. వరుస పరాజయా లు ఎదురవుతున్న నేపథ్యంలో ఇక్కడ గెలిచి తీరాలనే కసితో టీడీపీ ప్రయత్నాలు చేస్తుండ గా.. ఇప్పుడు కుమ్ములాటలు పెరగడంతో ఏం చేయాలనేది పెద్ద సమస్యగా మారింది. ఇక, ఇటీవల తాను పోటీ చేస్తానంటూ.. స్థానిక న్యాయవాది కొత్తపల్లి ఆనంద స్వరూప్ తెరమీదికి వచ్చారు.
నేరుగా ఆయన చంద్రబాబును కలిసి విన్నవించారు. బయోడేటా ప్రొఫైల్స్ కూడా ఇచ్చారు. తర్వాత.. ఆయన సూచనల మేరకు.. పార్టీ చీఫ్ అచ్చెన్నాయుడును కూడా కలుసుకున్నారు. పార్టీలో సీనియర్‌గా ఉన్నానని.. అందరితోనూ సంబంధ బాంధవ్యాలు.. ఉన్నాని.. తనకు అవకాశం ఇస్తే.. గెలిచి గిఫ్ట్‌గా ఇస్తానని కూడా ఆయన అంటున్నారు. దీనిపై పార్టీ ఆలోచన చేస్తోంది. ఇది మరింతగా నియోజకవర్గంలో కాకరేపింది. తనను సమన్వయ కర్తగా నియమించి.. వేరే వారి నుంచి దరఖాస్తు ఎలా తీసుకుంటారని.. దేవదత్ ప్రశ్నిస్తున్నారు.
స్థానికంగా పేరున్న కార్పొరేట్ వైద్య శాల నిర్వాహకుడు కావడం.. ఆర్థికంగాబలంగా ఉండడంతో దేవదత్ బాగా నమ్మకంగా ఉన్నారు. కానీ, కేడర్‌లో మాత్రంఆయనకు పట్టు లేదని పార్టీ భావిస్తోంది. ఇంకోవైపు.. తాడికొండలో గెలిచిన ఉండవల్లి శ్రీదేవి కూడా.. ఈ నియోజకవర్గం కావాలని.. పట్టుబడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తరచుగా ఆమె ఈ విషయాన్ని బాబుకు గుర్తు చేస్తున్నారు. అయితే.. బాబు ఎటూ తేల్చకుండా.. ఆచితూచి వ్యవహరిస్తు్న్నారు. ఫలితంగా ఇక్కడ పోటీ చేసేవారు పెరుగుతుండడం.. బాబు ఎటూ తేల్చకపోవడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుందో చూడాలి.