Begin typing your search above and press return to search.

టెకీలకు టైటాన్ గుడ్ న్యూస్... జాబులే జాబులు!

వచ్చే అయిదేళ్లలో రూ.1,00,000 కోట్ల వ్యాపారాన్ని సాధించే దిశగా ప్రయాణాన్ని తీర్చిదిద్దుకోనున్న నేపథ్యంలో ఈస్థాయిలో మ్యాన్ పవర్ అవసరం ఉంటుందని వెల్లడించింది.

By:  Tupaki Desk   |   22 Nov 2023 3:46 AM GMT
టెకీలకు టైటాన్  గుడ్  న్యూస్... జాబులే జాబులు!
X

టాటా గ్రూప్‌ దిగ్గజం టైటన్‌ కంపెనీ నియామకాల విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా... రానున్న ఐదేళ్ల కాలంలో 3,000 కుపైగా ఉద్యోగాలను నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. వచ్చే అయిదేళ్లలో రూ.1,00,000 కోట్ల వ్యాపారాన్ని సాధించే దిశగా ప్రయాణాన్ని తీర్చిదిద్దుకోనున్న నేపథ్యంలో ఈస్థాయిలో మ్యాన్ పవర్ అవసరం ఉంటుందని వెల్లడించింది.

అవును... వచ్చే అయిదేళ్లలో 3,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్లు టైటన్‌ కంపెనీ పేర్కొంది. వీటిలో ఇంజినీరింగ్, డిజైన్, డిజిటల్, లగ్జరీ, డేటా అనలిటిక్స్, మార్కెటింగ్‌ తదితర విభాగాలలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో... డేటా అనలిటిక్స్, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ మార్కెటింగ్‌ మొదలైన కొత్తతరం నైపుణ్యాల్లో నిపుణులను ఎంపిక చేసుకోనున్నట్లు వివరించింది.

ఈ సందర్భంగా స్పందించిన టైటన్‌ కంపెనీ హెచ్‌ఆర్‌ కార్పొరేట్‌ రిటైల్‌ హెడ్ ప్రియ మథిలాకాథ్‌ పిళ్లై... వచ్చే అయిదేళ్లలో రూ.1,00,000 కోట్ల వ్యాపారాన్ని సాధించే దిశగా తమ ప్రయాణాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 3,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇందులో ప్రధానంగా వచ్చే 2-3 ఏళ్లలో ఇంజినీరింగ్‌ సిబ్బందిని 50% పెంచుకోవాలని భావిస్తున్నట్లు టైటన్‌ పేర్కొంది. ఈ లెక్కన ఏటా జరిగే నియామకాల్లో క్యాంపస్ ప్లేస్ మెంట్స్ వాటా 15-18% వరకు ఉండొచ్చని చెబుతోంది. ఈ క్రమంలో... ప్రస్తుతం కంపెనీ సిబ్బందిలో 60% మంది మెట్రోపాలిటన్ సిటీల నుంచి ఉండగా... మిగిలినవారు రెండో, మూడో శ్రేణి పట్టణాల నుంచి ఉన్నారని తెలిపింది.

కాగా... టైటన్‌ మార్కెట్‌ విలువ 2019 మార్చి 28న ఫస్ట్ టైం రూ.లక్ష కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2021 అక్టోబరులో రూ.2 లక్షల కోట్లకు, తాజాగా రూ.3 లక్షల కోట్లకు సంస్థ మార్కెట్‌ విలువ చేరింది. దీంతో... దేశీయంగా మార్కెట్‌ విలువ పరంగా 17వ స్థానాన్ని పొందింది. మంగళవారం ఒక దశలో 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన రూ.3400 కు చేరుకోవడంతో సంస్థ మార్కెట్‌ విలువ రూ.3 లక్షల కోట్లను అధిగమించింది.