Begin typing your search above and press return to search.

మౌత్ టాక్ తో రేవంత్ కు టెన్షన్ పుట్టించాలట

మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తూ.. తమ రాజకీయ ప్రత్యర్థులను మాటలతో టార్గెట్ చేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

By:  Tupaki Desk   |   23 Nov 2023 5:19 AM GMT
మౌత్ టాక్ తో రేవంత్ కు టెన్షన్ పుట్టించాలట
X

తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారం అంతకంతకూ హీటెక్కుతోంది. అధికార బీఆర్ఎస్.. విపక్ష కాంగ్రెస్. బీజేపీల మధ్య మాటల యుద్ధం ఒక రేంజ్ లో సాగుతోంది. మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తూ.. తమ రాజకీయ ప్రత్యర్థులను మాటలతో టార్గెట్ చేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇదిలాఉంటే.. తాజాగా గులాబీ దళం పెద్ద ప్రణాళికను రూపొందించినట్లుగా చెబుతున్నారు.

దీని సారాంశం మొత్తాన్ని ఒక్క లైన్ లో చెప్పాలంటే.. మౌత్ టాక్ ను పెంచేసి.. రేవంత్ కు టెన్షన్ ను తీసుకురావాలన్నదే అతడి లక్ష్యమని చెబుతున్నారు. అంతేకాదు.. ఏ మౌత్ టాక్ తో ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేయాలన్నదే లక్ష్యమంటున్నారు. కాంగ్రెస్ కున్న సానుకూలత బీఆర్ఎస్ కు లేకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ టీఆర్ఎస్ కు మధ్య మాటల హోరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

ఇలాంటి వేళ.. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్ ను.. అతగాడు పోటీ చేస్తున్న కొడంగల్.. కామారెడ్డి రెండు చోట్ల బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ మధ్య అన్నట్లుగా పరిస్థితులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ అధినాయకత్వం భారీ మొత్తాన్ని రేవంత్ అండ్ కోకు ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. తగ్గేదేలే అన్నట్లుగా రేవంత్ తరఫు వారు నిలిచినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ.. సరికొత్త వ్యూహానికి తెర తీశారు రేవంత్ ప్రత్యర్థులు. చివరి వారం రోజుల్లో.. రేవంత్ పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ (కొడంగల్.. కామారెడ్డి) కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలోని కాంగ్రెస్ అభ్యర్థుల వి షయం ఎలా ఉన్నా.. రేవంత్ పోటీ చేస్తున్న రెండు అసెంబ్లీ స్థానాల్లో పట్టు కోల్పోయారని.. అధికార పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారన్న మౌత్ టాక్ ను భారీగా పెంచటమే లక్ష్యమని చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా పోలింగ్ కు కాస్త ముందుగా గందరగోళానికి గురి చేయటం.. రేవంత్ కు భయాందోళనలకు గురి చేసేలా చేసి.. ఎన్నికల లబ్థిని పొందాలన్న ఎత్తుగడను తెర మీదకు తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు.

కీలకమైన పోలింగ్ కు కాస్త ముందుగా ఈ తరహా ప్రచారం ఊపందుకుంటే.. రేవంత్ కన్ఫ్యూజ్ అవుతారని.. అది తమకు లాభిస్తుందన్న ఆలోచనలో ప్రత్యర్థులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇంతకూ ఈ తరహా ప్రచారాన్ని ఎలా చేస్తారన్న ప్రశ్నకు సైతం బదులిస్తున్నారు. ఎలా అయితే.. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు గాలి వీస్తుందన్న ప్రచారం మొదలైందో.. అదే రీతిలో రేవంత్ పోటీ చేసిన రెండుస్థానాల్లో ఓడిపోతున్నారన్న మౌత్ టాక్ ను అంతకంతకూ పెంచటమే లక్ష్యంగా ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.