Begin typing your search above and press return to search.

టోల్ వలిచేస్తారు .. దేనికి ఎంత ?

దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5 శాతం పెరిగాయి. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

By:  Tupaki Desk   |   3 Jun 2024 9:46 AM GMT
టోల్ వలిచేస్తారు .. దేనికి ఎంత ?
X

దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5 శాతం పెరిగాయి. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. మార్చి 31, 2025 వరకు పెరిగిన టోల్ రేట్లు అమల్లో ఉంటాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒకవైపు ప్రయాణానికి టోల్‌ ఛార్జీ రూ.5 పెరగగా, బస్సులు, ట్రక్కులు ఒక వైపు ప్రయాణానికి 25 రూపాయలు, రెండు వైపులా ప్రయాణానికి 35 రూపాయలు పెరిగాయి. భారీ సరకు రవాణా వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ. 35, రెండు వైపులా కలిసి రూ.50 వరకు టోల్‌ ఛార్జీలు పెంచారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని వాహనాలకు 25 శాతం రాయితీ లభిస్తుంది.

స్థానికుల నెలవారీ పాస్‌పైనా రూ.10 పెంచడంతో.. నెలవారీ పాస్‌ రేట్‌ రూ.330 నుంచి 340కి పెరిగింది. దీంతో పాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ఛార్జీలు సైతం పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2024 -25 కి సంబంధించి టోల్ చార్జీలను సగటున ఐదు శాతం పెంచుతున్నట్లు ఐఆర్‌బీ ఇన్ఫ్రా సంస్థ ప్రకటించింది.

6 కేటగిరీలుగా టోల్ చార్జీలను విభజించారు. ప్రతి కిలోమీటర్ కి వాహనాన్ని బట్టి ఛార్జీలను పెంచారు. కారు, జీపు లాంటి వెహికల్స్ కు 2.34 రూపాయలు, మినీ బస్సుకు 3.77, బస్సు రెండు ఆక్సిల్ ఉన్న ట్రక్కుకు 6.69, మూడు ఆక్సిల్ ఉన్నటువంటి వాహనాలకు 8.63 రూపాయలు.. ఇక భారీ నిర్మాణ యంత్రాలు ఎర్త్ మూవింగ్ నాలుగు ఐదు ఆరు ఆక్సిల్ ఉన్నటువంటి ట్రక్కులకు 12.40, భారీ వాహనాలు 7 అంతకంటే ఎక్కువ యాక్సిస్ ఉన్న వాహనాలకు 15.09 టోల్ ఛార్జీలను పెంచారు.