కాంప్రమైజ్ టైమ్!: మోహన్ బాబు - మనోజ్ మధ్యలో పెద్ద హీరో!
అవును... మంచు కుటుంబ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Dec 2024 10:12 AM GMTమంచు కుటుంబంలో జరుగుతోన్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే! మోహన్ బాబు, మనోజ్ ఇద్దరూ పరస్పరం సంచలన ఆరోపణలు చేసుకుంటూ ఫిర్యాదులు చేస్తూ, లేఖలు విడుదల చేశారు. ఇందులో భాగంగా... గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని.. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందంటూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు.
మరోవైపు.. తన కుమారుడు మంచు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో.. మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై కేసు నమోదైంది. ఎన్నో ట్విస్టులు, సంచలనాల నడుమ ఇప్పుడు ఈ వ్యవహారం కుటుంబ సభ్యులంత కూర్చుని మాట్లాడుకునేవరకూ వచ్చిందని అంటున్నారు. ఈ సమయంలో ఓ పెద్ద హీరో ఎంట్రీ ఇచ్చారని చెబుతున్నారు.
అవును... మంచు కుటుంబ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పటికే చినికి చినికి గాలివానగా మారిందని అంటున్న వేళ... తాజాగా మోహన్ బాబు నివాసంలో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లతో సన్నిహితుల సమక్షంలో ఓ పెద్ద హీరో వీరి చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ గానూ పెద్ద ఇన్ ఫ్లుయెన్సర్ గా పేరున్న సినీ నటుడు ఇప్పుడు మంచు కుటుంబ వ్యవహారంలో తండ్రీ కొడుకులు, అన్నదమ్ముల మధ్య పెద్దమనిషి హోదాలో చర్చలు చేస్తున్నారని అంటున్నారు. నేడు విదేశాల నుంచి మంచు విష్ణు కూడా రావడంతో... సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చే దిశగా విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
కాగా... ఈ విషయంపై తాజాగా స్పందించిన మనోజ్... తాను చేసేది ఆత్మగౌరవ పోరాటం అని.. ఇది ఆస్తి కోసమో, డబ్బు కోసమో కాదని.. ఇది తన భార్య, పిల్లల రక్షణకు సంబంధించిన విషయం అని.. తనను అణగదొక్కేందుకు తన భర్యను బెదిరింపులకు గురి చేయడం.. తన పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదని మంచు మనోజ్ మీడియా ముందు వెళ్లడించారు.
ఇంత జరిగినా... మరోపక్క మంచు విష్ణు మాత్రం... ఇది ఫ్యామీలీలో చిన్న గొడవ అని, తాము సెట్ చేసుకుంటామని.. కామెంట్ చేశారని అంటుండటం గమనార్హం! అయితే వాస్తవాలు అంత సులువుగా లేవని అంటున్నారని తెలుస్తోంది. ఇప్పుడున్న ఆస్థులన్నీ పూర్తిగా మోహన్ బాబు సంపాదించినవే అని.. ఆయన విష్ణుకు సపోర్ట్ చేస్తున్నారని మనోజ్ పరోక్షంగా ఆరోపిస్తున్నారని అంటున్నారు!
మరోపక్క ఆస్తుల విషయంలో మనోజ్ తగ్గేదేలే అన్నధోరణిలొనే ముందుకు కదులుతున్నారని అంటున్నారు. దీంతో... ఈ వ్యవహారంలో పెద్దమనిషిగా వెళ్లిన పెద్ద హీరోకి ఈ వ్యవహారం పెద్ద సమస్యగానే మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!