Begin typing your search above and press return to search.

ఒక్క దెబ్బ‌తో గ‌ద్ద‌ర్ అవార్డులు ప‌ట్టాలెక్కేశాయ్‌...!

ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే గద్దర్ అవార్డుల కోసం కలిసి రావాలని చిత్ర‌ పరిశ్రమకు ఓపెన్ గా సూచించినా ఎవరు ? పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   27 Dec 2024 6:02 AM GMT
ఒక్క దెబ్బ‌తో గ‌ద్ద‌ర్ అవార్డులు ప‌ట్టాలెక్కేశాయ్‌...!
X

టాలీవుడ్ కి ఉన్న అసంతృప్తుల లో అవార్డు ఒకటి. అటు జగన్ ప్రభుత్వం అవార్డులకు మొండి చేయి చూపించింది.. ఇటు తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా చేసింది ఏమీ లేదు. నంది అవార్డుల స్థానంలో సింహా అవార్డులు ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందే తప్ప ఇచ్చింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సింహా అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు.

అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు భేటీ అయిన సందర్భంగా సింహా అవార్డుల ప్రస్తావన వచ్చింది. త్వరలోనే అవార్డు ప్రక్రియ మొదలుపెడతామని రేవంత్ రెడ్డి టాలీవుడ్‌కు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమం అంతా ఎఫ్ టి సి ఆధ్వర్యంలో సమన్వయం చేసుకుంటూ జరపాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎఫ్‌టీసికి ఇప్పుడు తెలంగాణ అగ్ర‌ నిర్మాత దిల్ రాజు చైర్మన్ గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యం లోనే అవార్డుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అయితే అవార్డులు ఎప్పటినుంచి ఇస్తారు ? అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటి వరకు అవార్డులు లేవు.. అప్పటినుంచి కంటిన్యూ చేస్తారా ? లేదంటే ఇప్పుడు కొత్తగా 2024 నుంచే ప్రకటిస్తారా ?అన్నది చూడాల్సి ఉంది.

ఇక తెలంగాణలో టికెట్ రేట్ల‌ గురించి... బెనిఫిట్ షోల‌ గురించి ఎలాంటి చ‌ర్చ‌ జరగలేదు అని దిల్ రాజు చెపుతుంటే ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తాను అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడినట్టుగా ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉంటాయా ఉండవా ? అన్నది సంక్రాంతి సినిమాల నుంచి తేలిపోనుంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే గద్దర్ అవార్డుల కోసం కలిసి రావాలని చిత్ర‌ పరిశ్రమకు ఓపెన్ గా సూచించినా ఎవరు ? పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారు. ఎప్పుడు అయితే అల్లు అర్జున్ అరెస్టు జరిగిందో ? తాజా సమావేశంతో ఒక్కసారిగా గద్దర్ అవార్డుల విషయంలో టాలీవుడ్ కదిలి వచ్చినట్లయింది.